ఆంధ్రప్రదేశ్‌

మల్లన్న ఆభరణాలపై ఆరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 6: శ్రీశైలంలోని ఆంధ్రాబ్యాంకు శాఖలో ఉన్న శ్రీమల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల బంగారు, వెండి ఆభరణాలు, నగదు వివరాలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్‌గుప్త మంగళవారం పరిశీలించారు. దేవస్థానానికి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలు స్థానిక ఆంధ్రాబ్యాంకు శాఖలో నిర్వహిస్తున్నారు. స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించే బంగారు, వెండి ఆభరణాలు, నగదు, ఇప్పటికే స్వామి, అమ్మవార్లకు చేయించిన నగలను బ్యాంకుని లాకర్‌లో భద్రపరుస్తున్నారు. గతంలో దేవస్థానం ఇఓగా పనిచేసిన సాగర్‌బాబు అక్రమార్జనపై ఎసిబి అధికారుల సోదాల నేపధ్యంలో ఇఓ భరత్‌గుప్త రికార్డులు పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం బ్యాంకు చేరుకున్న ఇఓ లాకర్ విషయాన్ని సిబ్బందికి తెలిపారు. అయితే లాకర్ తాళం సాగర్‌బాబు వద్ద ఉండిపోయింది. దీంతో పోలీసుల సమక్షంలో లాకర్‌ను పగులగొట్టారు. లాకర్‌లో ఉన్న దేవస్థానానికి సంబంధించి ఆభరణాలు, నగలు బయటకు తీశారు. స్వామి అమ్మవార్లకు చెందిన నగలు, బంగారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఇఓ మాట్లాడుతూ గతంలో కార్యనిర్వాహణాధికారిగా పనిచేసిన సాగర్‌బాబుపై ఎసిబి దాడుల నేపధ్యంలో దేవస్థానానికి సంబంధించిన ఆభరణాలు, ఆర్థిక లావాదేవీల గురించి బ్యాంకు అధికారులతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. బంగారానికి సంబంధించిన వివరాలు సరిపోయాయని, వెండి, నగదు వివరాలను మరో రెండు రోజుల పాటు పరిశీలిస్తామన్నారు. అనంతరం ఆభరణాలను దేవాలయానికి తరలించారు. డిప్యూటీ తహశీల్దార్ సింగ్, ఎస్‌ఐ లోకేశ్‌కుమార్ ఉన్నారు.
ఉద్యోగుల గుండెల్లో గుబులు
శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన కెవి సాగర్‌బాబు అక్రమాస్తులపై ఎసిబి దాడుల నేపధ్యంలో దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. విజయవాడ, కర్నూలులోని ఆంధ్రాబ్యాంకు లాకర్ల నుంచి పెద్దఎత్తున నగదు, బంగారు, వెండి ఆభరణాలను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహించిన సాగర్‌బాబుతో పలువురు ఉద్యోగులు సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది. వీరిని ఆయన తన బినామీలుగా వాడుకుని వారి పేర అక్రమాస్తులు పెట్టినట్లు తెలుస్తోంది. సాగర్‌బాబు బినామీగా వ్యవహరించిన ఓ ఉద్యోగిని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. ఆ ఉద్యోగి పేర శ్రీశైలంలోని ఆంధ్రాబ్యాంకు శాఖలో ఉన్న లాకర్ తెరిచి అందులోంచి పెద్దమొత్తంలో నగదు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

చిత్రం.. ఆంధ్రాబ్యాంకు శాఖలో మల్లన్న ఆభరణాలను పరిశీలిస్తున్న ఇఓ నారాయణ భరత్‌గుప్త, అధికారులు