ఆంధ్రప్రదేశ్‌

కలాం పేరే ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 5: పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందచేసే పురస్కారాలకు ఏపీజే అబ్దుల్‌కలాం పేరునే తిరిగి ఖరారు చేసింది. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన వారికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార అవార్డులను ప్రభుత్వం అందచేస్తోంది. ఈ అవార్డు కింద 20 వేల నగదు, ల్యాప్‌టాప్‌ను అందచేస్తారు. ఈ అవార్డు పేరును వైఎస్సార్ విద్యా పురస్కారం కింద మారుస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మిస్సైల్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన కలాం పేరు మార్చడంపై విమర్శలు చోటు చేసుకున్నాయి. దీంతో సోమవారం జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేస్తూ మంగళవారం మరో ఉత్తర్వును జారీ చేసింది. గతంలో ఉన్న పేరులో స్వల్ప మార్పు చేసింది. ఈ ప్రతిభా అవార్డును ఇకపై డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం విద్యా పురస్కార అవార్డుగా వ్యవహరిస్తారు. వౌలనా అబుల్ కలాం అజాద్ జయంతి, జాతీయ విద్యా దినం రోజైన నవంబర్ 11న ఈ అవార్డులు అందచేస్తారు.