ఆంధ్రప్రదేశ్‌

అంతర్జాతీయ స్థాయి ప్రతిభ ఆంగ్లభాషతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: ఆంగ్లభాషలో నైపుణ్యాన్ని సాధించడం ద్వారా విద్యార్థులు అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచే అవకాశం ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు నూరుశాతం ఆంగ్లభాషపై నైపుణ్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న నేపధ్యంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంగ్లీషు మీడియంను సమర్థిస్తూ కడప నగరంలో గురువారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో అన్ని మండల, గ్రామ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రారంభమవుతుందన్నారు. ఇందుకోసం జనవరి నుంచి మే వరకు ఉపాధ్యాయులకు ఆంగ్లభాష బోధనపై శిక్షణ ఇప్పిస్తామని ఆయన అన్నారు. ఆంగ్లభాషలో బోధించేందుకు 98 వేల మంది ఉపాధ్యాయులు అవసరమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 62.36 శాతం విద్యార్థులు ఆంగ్లభాషలో విద్య అభ్యసిస్తున్నారన్నారు. దీన్ని నూరుశాతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆంగ్లభాష నైపుణ్యంతో మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే అవకాశం ఉందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే 70 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే విద్యార్థులకు ఆంగ్లభాషపై పట్టు అవసరమన్నారు. అదే సమయంలో తెలుగుభాష వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్ని అంశాల్లో తెలుగుభాషను బోధిస్తామన్నారు. కొందరు ఆంధ్రప్రదేశ్‌ను ఆంగ్లప్రదేశ్‌గా మారుస్తున్నారనడం సమంజసం కాదని అన్నారు.తమ పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదివిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లలకు ఇంగ్లీషు అవసరం లేదనడం సమంజసం కాదన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాష పాల్గొన్నారు.
*చిత్రం...కడపలో విలేఖరులతో మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్