ఆంధ్రప్రదేశ్‌

గ్రూప్ 1, 2 పరీక్షలను పాత పద్ధతిలోనే జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే గ్రూప్-1, 2 పరీక్షలను పా త పద్ధతిలోనే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. గురువారం అసెంబ్లీలో చంద్రబాబును కలిసి గ్రూప్-2 పోస్టుల సంఖ్యను 750 నుంచి 3వేలకు పెంచాలని కోరారు.
గ్రూప్ పరీక్షల విధానం మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సుమారు ఆరు లక్షల మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
గ్రూప్-1, 2, 3, 4 సర్వీస్ పరీక్షలను వేర్వేరు ప్రశ్నపత్రాలతో వేర్వేరు తేదీల్లో నిర్వహించడానికి జీవో నెం.50ను జారీచేశారు. 25వేల మంది అభ్యర్థులకు ఒక రకమైన పరీక్షా పత్రం చొప్పున వేర్వేరు తేదీలలో పరీక్షలు నిర్వహించాలని జీవోలో పేర్కొన్నారు. ఇలాంటి విధానం ఏ రాష్ట్రంలోనూ లేదని, చివరకు 12 లక్షల మందికి ఒకే దఫా సివిల్ సర్వీస్ పరీక్షలు నిర్వహించే యుపిఎస్‌సి కూడా ఇలా వేర్వేరు ప్రశ్నపత్రాలు ఇవ్వడం లేదని కృష్ణయ్య స్పష్టం చేశారు. 25వేల మంది అభ్యర్థులకు ఒక ప్రశ్న పత్రం చొప్పున వేర్వేరు ప్రశ్నపత్రాలు ఇవ్వడం వల్ల కొన్ని ప్రశ్నపత్రాలు సులభంగానూ, మరికొన్ని ప్రశ్నపత్రాలు కఠినతరంగానూ ఉండే అవకాశం ఉందని దీంతో పరీక్షా విధానంలో సమతౌల్యత లోపించి అభ్యర్థులకు సమన్యాయం జరగదని కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులతో చర్చించి నిరుద్యోగులకు అన్యాయం జరుగకుండా నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు కృష్ణయ్య వివరించారు. ఆంధ్రా సిఎంను కలసిని వారిలో జె శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, జి కృష్ణయాదవ్ తదితరులున్నారు.