ఆంధ్రప్రదేశ్‌

తిరుమల కొండపై వైకాపా దళారులు : ఏవీ రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 8: తిరుమల కొండ పై తిష్టవేసిన వైకాపా దళారులు కొండపైకి వచ్చిన భక్తుల నుండి అందినకాడికి దోచుకుంటున్నారని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఏవీ రమణ విమర్శించారు. వెంకన్న దర్శనం కోసం తిరుమల కొండకెళ్తే జే ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి నేడు అక్కడ నెలకొందని శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. కొండకెళ్తే జే ట్యాక్స్ వసూలు చేస్తూ వీఐపీ దర్శనాలు అమ్మేస్తున్నారని ఆరోపించారు. వందల సంఖ్యలో వైకాపా దళారులు భక్తులను గెద్దల్లా దోచుకుతింటున్నారని తెలిపారు. మూలిగే నక్కపై తాటికాయి పడినట్లు ఇప్పుడు తిరుమలలో గదుల అద్దె పెంచుతారా అంటూ ప్రశ్నించారు.