ఆంధ్రప్రదేశ్‌

తెలుగును ఆదరించటం అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 11: అమ్మలాంటి తెలుగు భాషను ఆదరించడం అందరి బాధ్యత అని రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో సామాజిక సేవకుడు, తెలుగు భాషాభిమాని ఆకుల ఏడుకొండలు రూపొందించిన కరపత్రాన్ని ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన భాష అయిన తెలుగుకు పూర్వ వైభవం వచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఆంగ్లంతో పాటు తెలుగుగు సరైన ప్రాధాన్యత కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచం అంతా తెలుగు భాషను కీర్తిస్తోందని, ఎందరో మహానుభావులు తెలుగు భాషకు ఊపిరి పోశారన్నారు. తెలుగు భాషను ప్రేమిద్దాం.. తెలుగు భాషను కాపాడుదాం అంటూ ఏడుకొండలు ఇచ్చిన నినాదానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పోగాకు బోర్డు యడ్లపాటి రఘునాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న యార్లగడ్డ, తదితరులు