ఆంధ్రప్రదేశ్‌

వేసవిలోనూ ‘పవర్’్ఫల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: వేసవిలో నింరంతర విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారించింది. పల్లెలు, పట్ణణాలు అనే తేడాలేకుండా సరఫరాలో ఎక్కడా అవాంతరాలు ఉండకూడదని పంపిణీ సంస్థలకు తేల్చిచెప్పింది. ఈనేపథ్యంలో ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో అధికారులు చేపట్టిన చర్యలను ఆదివారం ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వివరించారు. రానున్న వేసవిలో రోజువారీ విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని పంపిణీ సంస్థలు (డిస్కంలు) అంచనా వేస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి మే నెల మధ్యకాలంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని నిర్ణయించాయి. ఎన్టీటీపీఎస్, ఆర్టీపీపీ, కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలను డిసెంబర్ నాటికి 3లక్షల టన్నులు, వచ్చే ఏడాది జనవరికి 6లక్షలు, మార్చి నెలాఖరులోగా 9లక్షల టన్నులకు పెంచాల్సిన అవసరం ఉందని గుర్తించాయి. ఇలాగైతేనే మార్చి నుంచి జూన్ వరకు ఉండే గరిష్ట డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేసేందుకు వీలుంటుందని భావిస్తున్నాయి. ఇందులోభాగంగా వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. మారుమూల పల్లెల్లో సైతం కోత విధించకూడదనే నిర్ణయానికి వచ్చాయి. ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరగనున్న దృష్ట్యా అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశాయి. బొగ్గు నిల్వలను గరిష్టంగా పెంచే అంశంపై ప్రధానంగా దృష్టి సారించాయి. కేంద్ర విద్యుత్ సంస్థలు, గ్యాస్ ఆధారిత ఉత్పత్తి కంపెనీల నుంచి కొనుగోలు చేయటంతో పాటు హైడల్ విద్యుదుత్పాదనను మెరుగుపరిచే దిశగా సన్నాహాలు చేస్తున్నాయి. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రోజుకు 80మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసేందుకు నెలకు 17మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా, ప్రస్తుతం నెలకు 15మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అవుతోంది. మరోవైపు రోజువారీ విద్యుత్ సరఫరాను ప్రస్తుతం 55మిలియన్ యూనిట్ల నుంచి 80మిలియన్ యూనిట్లకు పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈనేపథ్యంలో అవసరమైతే విదేశాల నుండి కూడా బొగ్గు దిగుమతి చేసుకోవాలని జెన్‌కో నిర్ణయించింది. వచ్చే ఏడాది
ఫిబ్రవరి - జూలై మధ్యకాలంలో దశలవారీగా నెలకు 2లక్షల టన్నులు దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది.
ఇదిలావుండగా, కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు అవసరమైన లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వటం వంటి విషయాలన్నీ పూర్తి చేశామని ట్రాన్స్‌కో అధికారులు మంత్రి బాలినేనికి తెలిపారు. ఇందులోభాగంగా కేంద్ర విద్యుత్ సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 6184 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఈ దృష్ట్యా వేసవి నుంచి నిరంతర విద్యుత్ కొనుగోలుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. హెచ్‌ఎన్‌పీసీఎల్, సెంబ్‌కార్ప్, కేఎస్‌కే వంటి స్వతంత్ర ఉత్పత్తిదారుల నుంచి కూడా పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉంటుందని తెలిపారు. గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిదారుల నుంచి కూడా పూర్తిస్థాయి ఉత్పత్తి అందుబాటులో ఉండే దృష్ట్యా 300 మెగావాట్ల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఇదంతా ఒక ఎత్తయితే రాష్ట్రంలో రిజర్వాయర్ల నిండా పుష్కలంగా నీరు నిల్వ ఉండటం వేసవికి వరప్రదాయినిగా మారింది. శ్రీశైలం, మచ్‌కండ్, సీలేరు జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ల ద్వారా గత నాలుగేళ్లతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అధికారులు వివరించారు. దీనిపై మంత్రి బాలినేని స్పందిస్తూ.. వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాపై ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ, పరిశ్రమకు అవాంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందుబాటు ధరల్లోనే సరఫరా చేయాలనే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఈవిషయంలో నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా ఉండకూడదని స్పష్టం చేశారు. రాష్ట్ర రైతులకు ఇప్పటికే పగటిపూట 9గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయటంతో ప్రభుత్వ ప్రతిష్ట దేశవ్యాప్తంగా ఇనుమడించిందన్నారు. రైతులంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని, వారి శ్రేయస్సుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రకృతి కూడా ప్రభుత్వానికి సహకరించటంతో ఇప్పటివరకు జల విద్యుదుత్పాదనకు ఢోకా లేదన్నారు. రానున్న వేసవిలో అంచనాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు పనిచేస్తాయనే ఆశాభావాన్ని మంత్రి బాలినేని వ్యక్తం చేశారు.

*చిత్రం... ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి