ఆంధ్రప్రదేశ్‌

వైస్ చాన్సలర్లకూ నాయకత్వంపై శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లకు నాయకత్వ లక్షణాలపై వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం చెప్పారు. 304 నిబంధన కింద శాసనసభలో వై విశే్వశ్వరరెడ్డి, కాకాని గోవర్ధనరెడ్డి, అనిల్ కుమార్ పోలుబోయిన, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రాధాన్యతా ప్రాతిపదికపై రాష్ట్రంలోని అన్ని వర్శిటీలకు విసిలను నియమించామని, త్వరలోనే అంబేద్కర్ విశ్వవిద్యాలయం, యోగి వేమన వర్శిటీలకు విసిలను నియమిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్శిటీలకు కార్యనిర్వాహక మండళ్లను కూడా నియమించామని అన్నారు. ఐదు నూతన రాష్ట్ర యూనివర్శిటీల భవనాల నిర్మాణం నిమిత్తం 189.5 కోట్ల విడుదల కోసం ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొన్నారు. వివిధ వర్శిటీల్లో 90 ప్రొఫెసర్ పోస్టులు, 168 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 846 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని వెల్లడించారు.