ఆంధ్రప్రదేశ్‌

కొత్తగా 56 రైతు బజార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 18: రాష్ట్రంలో కొత్తగా మరో 56 రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న రైతు బజార్లను విస్తృత పరచటంతో పాటు పరిమితిని పెంచి రైతులకు అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రైతుమిషన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైతు బజార్లలో విక్రయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు ప్రయోజనం కలిగేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఎస్టేట్ అధికారుల వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. దీంతో పాటు మార్కెట్ యార్డులలో పూర్తిస్థాయి వసతులు కల్పించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు నియోజకవర్గానికి ఓ మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 207 యార్డులు అందుబాటులోకి రానున్నాయి. వీటికి గౌరవ చైర్మన్లుగా సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే వ్యవహరిస్తారు. కాగా పాలకవర్గ నియామకాల్లో చైర్మన్లతో సహా డైరెక్టర్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్‌తో పాటు మొత్తంగా మహిళలకు 50 శాతం ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
*చిత్రం... ఇసుకపై టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభిస్తున్న సీఎం, సీఎస్