ఆంధ్రప్రదేశ్‌

తహశీల్ ఆఫీసులో మహిళ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేజర్ల : ఇల్లు నిర్మించుకునే విషయంలో తహశీల్దార్ అడ్డుపడుతున్నారంటూ ఓ మహిళ తహశీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఉదంతం మండల కేంద్రమైన చేజర్లలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు గ్రామానికి చెందిన పల్లాల ధనమ్మ తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి వెళ్లింది. తహశీల్దార్ ఉద్దేశ్యపూర్వకంగా ఇల్లు కట్టుకోనీయకుండా అడ్డుపడుతున్నారంటూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను పైన పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించింది. దీంతో తక్షణం స్పందించిన తోటి అర్జీదారులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం బాధితురాలు ధనమ్మ మాట్లాడుతూ 2017లో ప్రభుత్వం కొంత స్థలాన్ని తనకు కేటాయించిందని, 2019లో అన్ని క్లియరెన్స్‌లు వచ్చాయని తెలిపింది. అయితే ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు సిద్ధపడగా తహశీల్దార్ అడ్డుకుంటున్నట్లు వాపోయింది. అది ప్రభుత్వ స్థలమని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ ఆదేశించారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో గత్యంతరం లేక ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పేర్కొంది. కాగా తహశీల్దార్ సుధాకర్ మాట్లాడుతూ అసైన్‌మెంట్ స్థలాన్ని క్రయ, విక్రయాలు జరపకూడదన్నారు. మహిళ చెప్తున్న స్థలం క్రయ విక్రయాలు జరిగినందున దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అంతే తప్ప ఎవరి వత్తిళ్లకు తలొగ్గి అడ్డుకోవడం లేదని వివరణ ఇచ్చారు.
ఆత్మకూరులో మరో ఘటన
ఇదిలావుండగా ఆత్మకూరులో జరిగిన వేరొక ఘటనలో మరో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మూడేళ్లుగా తన బిడ్డ ఆధార్ కార్డు కోసం అధికారుల చుట్టూ తిరిగి విసిగిన ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు పట్టణానికి చెందిన దేవన నాగిరెడ్డికుమారి తన వికలాంగ బాలుడి ఆధార్ నమోదు కోసం గత మూడేళ్లుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు చెప్పింది. ఆధార్ కార్డు మంజూరైతే దివ్యాంగుడైన తన బిడ్డకు ప్రభుత్వం కల్పించే పథకాలు వర్తిస్తాయని తెలిపింది. ఈ కారణంతో పలుమార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ గత మూడేళ్లుగా తిరుగుతున్నట్లు పేర్కొంది. ప్రయోజనం లేకపోవడంతో సోమవారం మరోమారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రం వద్ద ప్రయత్నించినట్లు తెలిపింది. ప్రయోజనం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించే క్రమంలో వైకాపా నాయకులు సూరా భాస్కర్‌రెడ్డి, కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆర్డీవో కార్యాలయ ప్రాంతంలో కొంతసేపు ఆందోళన నెలకొంది. వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్న ఆర్డీవో ఉమాదేవి విషయం తెలుసుకుని బయటకు వచ్చి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. తక్షణం ఆధార్ కేంద్రం నిర్వాకులను పిలిపించి బాలుడికి ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేయాలని ఆదేశించారు. తన అధికారిక వాహనంలో బాధితులను ఆధార్ కేంద్రానికి పంపించారు. దీంతో బాధితురాలు శాంతించింది. ఈ సందర్భంగా ఆర్డీవో ఉమాదేవి మాట్లాడుతూ సమస్యలు ఉంటే శాంతియుతంగా పరిష్కరిచుకోవాలే తప్ప ఇలా ఆత్యహత్యాయత్నం చేయడం సరికాదని సూచించారు. ప్రతి దానికీ బెదిరింపులే పరిష్కారమైతే ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించడం సవాల్‌గా మారుతుందని హితవు పలికారు. బాలుడి చేతి వేళ్లు కంప్యూటర్ తీసుకోని కారణంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినా ప్రయోజనం లేకపోయిందని ఆమె తెలిపారు. సమస్యను ప్రత్యేకమైనదిగా భావించి బాలుడికి ఆధార్ నమోదుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.