ఆంధ్రప్రదేశ్‌

ఇసుక దోపిడీ పెంచేందుకే పాలసీ: కిమిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 18: ఐదు నెలల తర్వాత, 50 మంది నిర్మాణ రంగ కార్మికులు మృతిచెందాక, సిమెంటు, ఇనుము ధరలు పడిపోయాక ఇసుక సమస్యపై కళ్లు తెరిచినట్లు రాష్ట్రప్రభుత్వం నటిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఎద్దేవాచేశారు. సోమవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించి, ఇసుక మాఫియా పేరుతో నియోజకవర్గాల వారీగా ఇసుక దోపిడీ పెంచేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని, ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలే అందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని రాజాం నియోజకవర్గం తునివాడ ఇసుకరీచ్‌లో టన్ను ఇసుక ధరను రూ.556గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నాలుగు టన్నుల ఇసుక ధర 2224 రూపాయలు అవుతుందని, కొనుగోలు పాయింట్ నుండి గ్రామాలకు తరలించడానికి కార్మిక, రవాణాఛార్జీలు కలిపి అదనంగా 1500 రూపాయల వరకు అవుతుందన్నారు. మొత్తంగా ట్రాక్టర్ ఇసుక రూ.3,724లకు కొనాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందన్నారు. నూతన ఇసుక విధానాన్ని పరిశీలించినా, ఇసుక లభ్యత పేరుతో ఇచ్చిన ప్రకటనలు చూసినా ప్రభుత్వ పర్యవేక్షణలోనే వైసీపీ నేతలు ఇసుక దోపిడీ చేసేలా తలుపులు తెరిచారనేది స్పష్టమవుతుందని కళా వెంకట్రావు విమర్శించారు.