ఆంధ్రప్రదేశ్‌

స్పైస్‌జెట్ ఆలస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, నవంబర్ 21: స్పైస్‌జెట్ విమానం ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన సంఘటన రేణిగుంట విమానాశ్రయంలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం 4.30 గంటలకు ముంబయ నుండి హైదరాబాద్ మీదుగా రేణిగుంటకు రావల్సిన స్పైస్‌జెట్ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తాము అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాలనుకుంటే విమానాశ్రయంలోని స్పైస్‌జెట్ సంస్థకు చెందిన అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. సాయంత్రం 4.30 గంటలకు రావల్సిన విమానం ఆలస్యమైందని, ఆరు గంటలకు వస్తుందని తిరిగి 8 గంటలకు వస్తుందని చెపుతూ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు మంచినీరు, భోజనం ఏర్పాటు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పైస్ జెట్‌కు సంబంధించిన అధికారులను వివరణ కోరగా ముంబై నుండి హైదరాబాద్ వయా రేణిగుంటకు రావల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్యతో ముంబై విమానాశ్రయంలో ఆగిపోయిందని తెలిపారు.
యుద్ధప్రాతిపదికన విమానానికి మరమ్మతులు చేసి ప్రయాణానికి సిద్ధం చేస్తున్నారని అన్నారు. కచ్చితమైన సమయం అక్కడ నుండి సమాచారం ఇస్తే తాము చెబుతామన్నారు. రేణిగుంటలో సమస్య తలెత్తితే తాము కచ్చితమైన సమయం చెప్పగలమని పేర్కొన్నారు. ఇప్పటికే ఆలస్యమైనందుకు ప్రయాణికులకు తమ సంస్థ నుండి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 172 మంది ప్రయాణికులతో ప్రయాణించే విమానంలో ఒకరిద్దరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.