ఆంధ్రప్రదేశ్‌

విభజన ద్రోహంలో మీ అన్న పాత్ర లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 10: రాష్ట్ర విభజన విషయంలో బిజెపి వైఖరిని ద్రోహంగా పేర్కొంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆనాటి విభజన పాపంలో మీ అన్న చిరంజీవి పాత్రను గుర్తుకు తెచ్చుకోవాలని బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి హితవు పలికారు. విశాఖలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మంత్రి పదవి కోసం ప్రజారాజ్యం పార్టీని, పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌కు అమ్మేసిన ఘనత మీ అన్నదేనని ఘాటుగా విమర్శించారు. పార్లమెంటరీ, రాజ్యాంగ వ్యవస్థలను అవహేళన చేసి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్‌కు రాజకీయ పరిపక్వత లేదన్నారు. రాజకీయాలంటే సినిమాల్లో నటించడం కాదని, స్టేజిపై ఒక్కడివే అంతా నేనే అన్నట్టు వ్యవహరించడం అహంభావానికి పరాకాష్టగా పేర్కొన్నారు. ఆరు నెలలకోసారి నిద్రలేచి పోరాడుతానంటూ గర్జించి, తిరిగి యోగనిద్రలోకి వెళ్తున్నానంటూ అసందర్భ ప్రసంగాలు మానుకోవాలని సూచించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై విమర్శలు చేసే ముందు ఆయన రాజకీయ జీవితాన్ని ఒకసారి గమనించాలన్నారు. పవన్ పుట్టకముందే వెంకయ్యనాయుడు రాజకీయ పదవులు అనుభవించారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో సాంకేతిక అంశాలే అడ్డంకిగా పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్రం రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో రూ.1.25 లక్షల కోట్లు ఇస్తే పాచిన లడ్డూలుగా విమర్శించడం తగదన్నారు. ప్యాకేజీపై అవగాహన ఉంటే ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉంటే ప్రజారాజ్యం పార్ట్ 2 పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు ఎం నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.