ఆంధ్రప్రదేశ్‌

భావితరాల భవిష్యత్ కోసం టీడీపీ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, డిసెంబర్ 2: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతరించి పోతుందన్న ప్రచారం జరుగుతోందని, తెలుగుజాతి ఉన్నంత వరకు తమ పార్టీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. కర్నూ లు నగరంలో సోమవారం నిర్వహించిన పార్టీ విస్తృత
స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీని దెబ్బతీసే శక్తి ఎవ్వరికీ లేదన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు పార్టీ మనుగడకు ఢోకా లేదన్నారు. రాష్ట్రంలో 65 లక్షల మంది అనేక రంగాల్లో నిష్ణాతులైన సైనికులు పార్టీకి అండగా ఉన్నారన్నారు. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని, గెలుపోటమిలను సమానంగా తీసుకుని ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో వైకాపా సాగిస్తున్న విధ్వంసకర పాలన గురించి ప్రజలకు వివరించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త ముందుకురావాలన్నారు. భావితరాల భవిష్యత్ కోసం కృషి చేసే పార్టీ తెలుగుదేశం అని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలన్నారు. భవిష్యత్‌లో 30 సంవత్సరాల పాటు ఏకధాటిగా అధికారంలో కొనసాగే విధంగా నాయకత్వ రూపకల్పనకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు వివరించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి సంస్థాగత ఎన్నికలు నిర్వహించి, అందులో యువతకు 33 శాతం అవకాశం కల్పించి పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి నిర్వాకం వల్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడంతో అభివృద్ధికి ఆటంకంగా మారుతోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించి, సంపద సృష్టించడంతో ఆదాయం తీసుకొచ్చిందన్నారు. అయితే వైయస్ జగన్ అభివృద్ధి గురించి పట్టించుకోవటం లేదని, కేవలం టీడీపి నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నాడని ఆరోపించారు. ఉపాధి లేకపోతే ఆదాయం రాదని, ఆదాయం లేకపోతే రాష్ట్రం ఆర్థికంగా దివాల తీసే పరిస్థితి వస్తుందన్న విషయాన్ని గురించుకుని పరిపాలన కొనసాగించాలని సూచించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఇసుక పాలసీతో పాటు అన్న క్యాంటీన్ల ఎత్తివేత, మద్యనిషేధంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ రద్దు చేస్తూ రద్దుల ప్రభుత్వంగా మారిందన్నారు. నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని సక్రమంగా అమలు చేయటం లేదని, అమ్మఒడి మొదట అందరికీ వర్తింప జేస్తామని చెప్పి 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధన పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాము ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం కాదని, గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టి. రామారావు రెసిడెన్సియల్ పాఠశాలను ప్రవేశపెడితే తాను మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టానన్నారు. ఎస్సీ కులాలైన మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టానని తనపై ఆరోపణలు చేస్తున్నారని, సామాజిక న్యాయం కోసమే ఏబీసీడీ వర్గీకరణ చేశామన్నారు. ఎస్సీ కులాల్లో ఏబీసీడీ పెట్టడం వల్ల మాదిగలకు న్యాయం జరిగిందని స్పష్టం చేశారు. మహిళలపై అఘాత్యాలకు పాల్పతున్న మానవ మృగాలను బహిరంగంగా ఉరి తీయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రియాంకారెడ్డిని దారుణంగా చంపిన హంతకులను ఉరి తీయాలన్నారు. కార్యకర్తలు అధైర్య పడకుండా మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, భూమా అఖిల ప్రియ, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కెయి ప్రభాకర్, బిటి. నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు, కోట్ల సుజాతమ్మ, గౌరు చరితమ్మ, జనార్ధన్‌రెడ్డి, జయనాగేశ్వరెడ్డి, టీజీ. భరత్, మాండ్ర శివానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు