ఆంధ్రప్రదేశ్‌

‘క్యాబ్’ ప్రమాదకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 15: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్)తో దేశ ప్రజలకు అత్యంత ప్రమాదం పొంచి ఉందని, దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న వామపక్ష పార్టీలు రాష్టవ్య్రాప్త నిరసనలకు పిలుపునిచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీ శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని సీపీఐ ఆఫీసు దాసరి భవన్‌లో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకుడు డీ హరినాథ్ అధ్యక్షతన ఆదివారం వామపక్ష పార్టీల రాష్ట్ర నేతలు సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజానిరసనలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ అందరూ వీధుల్లోకి వచ్చి రణరంగాన్ని సృష్టిస్తున్నారన్నారు. కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఈ నెల 19న రాష్ట్రంలోనూ అన్ని నగరాలు, పట్టణాల్లో నిరసనలు, ధర్నాలు, సభలకు పిలుపునిచ్చామని, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని మద్దతివ్వాలని కోరారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాం, బెంగాల్, త్రిపుర, తదితర రాష్ట్రాల్లో ప్రజలు పెద్దఎత్తున తిరుగుబాటు చేస్తున్నారన్నారు. అక్కడక్కడా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఈ బిల్లు ప్రకారం 1971 మార్చి 24కి ముందు ఇక్కడ నివాసమున్నామంటూ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా నిరూపించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అంతా ముక్తకంఠంతో కేంద్ర నిర్ణయాన్ని నిరసించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, సీహెచ్ బాబూరావు, ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు పీవీ సుందరరామరాజు, సీపీఐ (ఎంఎల్) నాయకుడు జాస్తి కిశోర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.