ఆంధ్రప్రదేశ్‌

శవ రాజకీయాలకు తెరలేపుతున్న టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 15: ఉల్లిపాయల ధరపై శాసనసభలో రెండోరోజు చర్చించామని, గుడివాడలో ఓ వ్యక్తి మార్కెట్‌కు వెళ్లి మృతి చెందితే ఉల్లి కోసం క్యూలైన్లో అంటూ రంగుపులిమి శవ రాజకీయాలు చేసేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంత్రి కొడాలి నాని బాధితుడి ఇంటికి వెళ్లి వాస్తవాలు విచారిస్తే ఆయన ఉల్లిపాయల కోసం వెళ్లలేదని, అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులే చెప్పారన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఉల్లి ధర పెరిగిన నేపథ్యంలో కేజీ 25 రూపాయలకే ప్రజలకు అందిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా 30కోట్లు ప్రభుత్వం వెచ్చించిందని తెలిపారు. అసెంబ్లీలో రైతు భరోసాపై కూడా చర్చ జరిగిందని, ఆ అంశంపై గందరగోళం సృష్టించేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించారన్నారు. మూడోరోజు కూడా 50శాతం రిజర్వేషన్లు, నామినేటెడ్ పోస్టులు, ఆర్టీసీలో బస్సుల కొనుగోలు, రాయలసీమ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చిస్తే టీడీపీ సభ్యులు వెనకడుగు వేశారన్నారు. రాయలసీమ నుంచి ఎన్నికైన బాలకృష్ణ, చంద్రబాబు ఆ ప్రాంత ప్రాజెక్టులపై చర్చించలేక చేతులెత్తేశారని విమర్శించారు. అదేరోజు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై జరిగిన చర్చలో ప్రభుత్వం తరపున చక్కగా వివరణ ఇచ్చామన్నారు. అసెంబ్లీకి వచ్చే విషయంలో ప్రతిపక్ష నేతకు ప్రత్యేక ద్వారం ఉన్నప్పటికీ వేరే ద్వారంలో ప్రవేశించారని, అల్లరి మూకతో కలిసి వచ్చే ప్రయత్నం చేశారని, మార్షల్స్ ఆపితే దురుసు పదజాలంతో ఉద్యోగులనే గౌరవం లేకుండా లోకేష్ ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. మార్షల్స్‌తో చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరు అందరూ చూశారని, ఆయన తప్పు ఉన్నప్పటికీ ఎదురుదాడి చేస్తున్నట్లు వీడియో ఫుటేజీలో స్పష్టంగా ఉందన్నారు. ఏదోరకంగా రాష్ట్ర ఖ్యాతిని దిగజార్చాలని, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి మంచిపేరు రాకూడదని తెలుగుదేశం నేతలు కుట్రలు పన్నుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు ప్రవర్తించిన తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. గత ఐదేళ్లలో ప్రజాసమస్యలపై ఎలాంటి చర్చకు జరగలేదన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విప్లవాత్మక బిల్లులు తెచ్చారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించటం చారిత్రక నిర్ణయమని చెప్పారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించే చంద్రబాబు బడుగు, బలహీన వర్గాల కోసం ఏనాడూ ఆలోచన చేయలేదని బాబురావు విమర్శించారు.

*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న శ్రీకాంత్‌రెడ్డి