ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ అసత్య ప్రచారానికి వేదికైన అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 15: రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభను వేదికగా చేసుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితో కలిసి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని ఆదివారం ఆయనిక్కడ ఒక ప్రకటనలో విమర్శించారు. శాసనసభలోకి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వెళుతుంటే మార్షల్స్ అడ్డుకున్నారని, నో క్వశ్చన్ సభలోకి వెళ్లాలి తలుపులు తీయండని చంద్రబాబు అడిగితే తిట్టినట్లు ప్రచారం చేసిన ఘనత వైసీపీ ఎమ్మెల్యేలకే దక్కిందన్నారు. ఈ అసత్య ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆరు నెలల్లో జగన్ ప్రజావ్యతిరేక విధానాల్ని అసెంబ్లీలో లేవనెత్తితే సమాధానాలు దాటవేసేందుకే వైసీపీ దుష్ప్రచారానికి నాంది పలికిందని మండిపడ్డారు. దీనిపై జగన్మోహనరెడ్డి రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని జవహర్ డిమాండ్ చేశారు.