ఆంధ్రప్రదేశ్‌

మంగళగిరి ఎమ్మెల్యేకి బెదిరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, సెప్టెంబర్ 12: గుంటూరుజిల్లా మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులనుంచి సోమవారం పోస్టుద్వారా బెదిరింపులేఖ అందింది. వెంటనే ఆయన లేఖతో మంగళగిరి పోలీసుస్టేషనుకు వెళ్లి సిఐ బ్రహ్మయ్యకు ఫిర్యాదు చేశారు. లేఖ సారాంశం ఇలా ఉంది. .. రామకృష్ణారెడ్డి ఒళ్లు ఎలా ఉంది. మా ముఖ్యమంత్రి మీద కోర్టులో కేసు వేశావు, దానిమీద హైకోర్టులో స్టే తెచ్చుకుంటే నువ్వు మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాలని అనుకుంటున్నావని తెలిసింది, నీకు ఇవే చివరి రోజులు నిన్ను నీ నియోజకవర్గంలోనే చంపుతా చూస్తూ ఉండు... నీకు రోజులు దగ్గరపడి మా నాయకుడిమీద కేసు వేశావు, నీ చావు నువ్వు కొనితెచ్చుకున్నావు ఇంక నిన్ను బతకనివ్వం చూస్తూఉండు.. ఖబడ్దార్ (చుక్కలు పెట్టినచోట లేఖలో బూతులు ఉన్నందున రాయలేదని గమనించగలరు) అంటూ తెల్లపేపరుపై ఇంకుపెన్నుతో 18లైన్లు చేతితో రాసిన బెదిరింపు లేఖ తన కార్యాలయంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే ఆర్కేకు పోస్ట్‌లో అందింది.
గతంలో కూడా ఇలానే ఇసుక మాఫియా ఆర్కేను బెదిరిస్తూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలిచాక ఇది తనకు నాలుగవ బెదిరింపులేఖ అని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆర్కే కోరారు. పోలీసుస్టేషను వద్ద ఎమ్మెల్యే ఆర్కే విలేఖర్లతో మాట్లాడుతూ అవినీతి, అక్రమాలను అడ్డుకుంటున్నందుకే బెదిరింపులు వస్తున్నాయన్నారు.
ఎన్నికల సమయంలోను బెదిరింపు లేఖ వచ్చిందని, తర్వాత ఇసుక మాఫియా నుంచి చంపుతామంటూ ఒక బెదిరింపులేక వచ్చిందని, డబ్బులు ఇవ్వాలని మావోయిస్టుల పేరిట ఫోనులో బెదిరించగా ఇద్దరు నకిలీ మావోయిస్టులను అరెస్ట్ చేశారని, కేసు కోర్టులో నడుస్తోందని అన్నారు. పోలీసులు తనకు రక్షణ కల్పించి నిందితులను పట్టుకోవాలని ,ఇలాంటి బెదిరింపులను తాను భయపడనని ఆర్కే అన్నారు.