ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలంలో భక్తులకు సాయంత్రం అల్పాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 12: శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిత్యం సాయంత్రం పూట అల్పాహార అందించే కార్యక్రమాన్ని ఇఓ నారాయణ భరత్‌గుప్తా సోమవారం ప్రారంభించారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మంగళ, బుధ, గురువారాల్లో 2 వేల మందికి, శని, ఆది, సోమవారాల్లో 3 వేల మందికి నిత్యం అన్న ప్రసాద వితరణ ఉదయం 9 గంటల నుంచి జరుగుతోంది. అయితే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు అల్పాహారం అందించాలని దేవస్థానం నిర్ణయించింది. దీంతో సోమవారం నుంచే ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. వారంలో రెండు రోజులు ఉప్మా, రెండు రోజులు కిచిడి, రెండు రోజులు పొంగల్, ఒక రోజు టమోటాబాత్ అల్పాహారంగా అందిస్తారు. ఉదయం పూట జరుగుతున్న అన్నదానం పట్ల భక్తులు సంతృప్తిగా ఉన్నారని ఇఓ తెలిపారు. భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేందుకే సాయంత్రం పూట అల్పాహారం అందజేస్తున్నామన్నారు.