ఆంధ్రప్రదేశ్‌

తీరని పులి‘చింత’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 12: కృష్ణాడెల్టాకు వరప్రదాయిని అయిన బహుళార్ధసాధక ప్రాజెక్టు పులిచింతల నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ నిర్వాసితులకు పునరావాస చర్యలు కొలిక్కిరాలేదు.. అసైన్డు భూములకు చెల్లింపు విషయంలో తెలంగాణలోని ముంపు గ్రామాలకు ఒక నిబంధన.. ఏపి గ్రామాలకు మరో రకమైన రూల్స్ విధించటంతో ఏళ్ల తరబడి వివాదం కొనసాగుతోంది.. పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీ (ఆర్ అండ్ ఆర్) యాక్టు ప్రకారం నిర్వాసితులకు ఏర్పాటయిన కాలనీలలో ఇప్పటికీ మంచినీటికి గతిలేదంటే పరిస్థితి ఏ రకంగా ఉందనేది ఊహించుకోవచ్చు. ముంపుగ్రామాల ప్రజలకు ఇతర మండలాల్లో పునారావాసాలు ఏర్పాటు చేశారు. అయితే గజెట్‌లో ప్రకటించకపోవడంతో నిర్వాసితులకు స్థానికత సమస్యలు తలెత్తుతున్నాయి. ధ్రువీకరణ పత్రాల మంజూరులో తమ పరిధిలోకి రాదని అధికారులు తేల్చిచెప్పటంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆలయ భూములు సాగుచేసుకుంటున్న కౌలురైతులకు పరిహారం చెల్లించకుండా దేవాదాయశాఖకు బదలాయించడంతో పునరావాసానికి, నష్టపరిహారానికి నోచుకోక రైతులు విలవిల్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పేచీ తలెత్తిన కారణంగా ఏపి సర్కార్ కొన్ని నెలల క్రితం తెలంగాణ రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించింది. సొంత రాష్ట్రంలో ప్రాజెక్టుకు భూములిచ్చి ఇబ్బందులు ఎదుర్కుంటున్నా తమను పట్టించుకునే నాథుడులేడని రైతులు, నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ అండ్ ఆర్ యాక్టు ప్రకారం ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రూ. 2.42 లక్షలు చెల్లించారు. అయితే అప్పట్లో వయోపరిమితి కొద్దోగొప్పో తేడా ఉన్న యువకులకు ప్యాకేజీ వర్తింపచేయలేదు. దీంతో సుమారు వెయ్యి మందికి పైగా యువకులు పునరావాసానికి నోచుకోలేదు. ప్రాజెక్టు అవసరాలకు ప్రభుత్వం సుమారు 13వేల ఎకరాల వరకు భూములు సేకరించింది. సుమారు 45 టిఎంసిల నీటినిల్వ సామర్థ్యంతో పాటు 120 మెగావాట్ల విద్యుదుత్పాదనతో బహుళార్ధకంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తికావచ్చాయి. హైడల్ పవర్ జనరేషన్ ప్లాంటు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు అంచనాలు రెట్టింపయినా రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం అంతంతమాత్రంగానే ఉందనేది స్పష్టమవుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గుంటూరు జిల్లాలో బోధనం, గోపాలపురం, కామేపల్లి, కేతవరం, ఎస్‌ఎన్ తండా, నూతి అగ్రహారం, కోళ్లూరు, గొల్లపేట, పులిచింతల, గోవిందాపురం, వేమవరం (పాక్షికంగా), వెల్లంపల్లి గ్రామాలను ముంపుప్రాంతాలుగా గుర్తించి ప్రభుత్వం పునరావాస ప్యాకేజీని ప్రకటించింది. ముంపు గ్రామాల ప్రజలకు జిల్లాలోనే 8 చోట్ల పునరావాసం, పునర్నిర్మాణం కింద కాలనీలను నిర్మించారు.
పునరావాస కార్యక్రమాల్లో భాగంగా ముంపు గ్రామాలకు గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల, మాచవరం, అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లోని గ్రామాల్లో కాలనీలు నిర్మించారు. పిడుగురాళ్ల మండలం కొండమోడు, కోళ్లూరు, కేతవరం, చిట్యాల, బ్రాహ్మణపల్లి, బోధనం మండలం చౌటపాపాయపాలెం, రాజుపాలెం మండలంలో రాజుపాలెం, రెడ్డిగూడెం, బెల్లంకొండ మండలం మాచాయపాలెం, అచ్చంపేట మండలం పెదపాలెమ, చామర్రు, నీలేశ్వరపాలెం గ్రామాల్లో ప్రత్యామ్నాయంగా పునర్నిర్మాణాలు ఏర్పాటు చేశారు. అయితే ఆర్ అండ్ ఆర్ యాక్టు ప్రకారం కొత్తగా ఏర్పాటైన కాలనీలను సంబంధిత మండల గ్రామాల్లో కలుపుతున్నట్లు గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ఇందులో జాప్యం కారణంగా నిర్వాసితులకు స్థానికత సమస్య తలెత్తుతోంది. కేతవరం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన 1453 ఎకరాల సాగుభూమిని సేకరించింది. అయితే అప్పటికే తరతరాలుగా సాగుచేసుకుంటున్న కౌలు రైతులకు ఎక్స్‌గ్రేషియో ఇప్పటికీ చెల్లించలేదు.

చిత్రం.. పులిచింతల ప్రాజెక్టు