ఆంధ్రప్రదేశ్‌

3 మీటర్ల లోతులోనే నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: ఆంధ్ర రాష్ట్రం అంతా మూడు మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చేలా ‘నీరు-ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. నీటి సంక్షోభాన్ని దుష్ఫలితాల కారణంగా రాష్ట్రాల మధ్య నిప్పు రాజుకుంటోందని, నీటి కోసం ప్రజల మధ్య ఘర్షణలు చెలరేగడం బాధాకరమని, రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితి కాకుండా నీరు-ప్రగతి కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. భూగర్భ జలాలను పొందించడం, గొట్టపుబావుల రీఛార్జింగ్, సమర్థ నీటి నిర్వహణ, చెరవుల పునరుద్ధరణపై అధికారులు దృష్టిసారించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రాలకు వర్షాలు వచ్చే ముందు 8 మీటర్ల లోతున ఉన్న భూగర్భ జలాలు, వర్షాల అనంతరం కనీసం మూడు మీటర్ల లోతునే భూగర్భ జలాలు ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 35 శాతం భూభాగంలో నీటి మట్టాలు 3 మీటర్ల నుండి 8 మీటర్ల మధ్య ఉన్నాయి, 18 శాతం ప్రాంతంలో భూగర్భ జలమట్టం 3 మీటర్ల కంటే పైనే ఉంది, 47 శాతం ప్రాంతంలో 8 మీ టర్ల కంటే లోతున ఉందని ఇటీవల నిర్వహించిన భూగర్భ జలాల సమీక్షలో తేలింది. పులిచింతల రిజర్వాయిర్ క్యాచ్‌మెంట్ ఏరియాలో 18 సెంమీ నుండి 20 సెంమీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఇంత వరకూ 454 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకావల్సి ఉండగా 397 మిల్లీమీటర్లు నమోదైంది. ప్రస్తుతానికి 13 శాతం వర్షపాతం లోటు గుర్తించారు. మే 1 నుండి తీసుకుంటే 1.31 మిమీ భూగర్భ జలమట్టం పెరిగింది. ఇది 118 టిఎంసిలకు సమానంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు ముమ్మరంగా పడుతున్నాయని, కడప, కర్నూలులో ఆశాజనకంగా ఉందని నేలపై పడే ప్రతి వాన చుక్క భూగర్భంలో ఇంకేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పదే పదే సూచిస్తున్నారు. జలాశయాల్లో కూడా పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయాలని , ఈ విషయంలో అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని సిఎం చెప్పారు.
వాననీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణలో లక్ష మంది ఇంజనీరింగ్ విద్యార్థుల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో ప్రతి మండలంలో కనీసం 10 చెరువుల పునరుద్ధరణ జరగేలా చర్యలు చేపట్టాలని, చెరువులు -సెలయేళ్లు అనే అంశాన్ని విద్యార్థులకు ప్రాజెక్టు వర్కు కింద చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పంట సంజీవని కింద 2.69 లక్షల కుంటలు తవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 73,970 కుంటల తవ్వకం పూర్తయింది. అక్టోబర్ నాటికి ఎన్టీఆర్ జలసిరి రెండో దశ పనులను కూడా పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రతి మొక్కకూ జియోట్యాగింగ్ పూర్తి చేయడం, మరో పక్క గ్రామాల్లో పక్కా గృహాల నిర్మాణం కూడా పూర్తి చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ఆరు లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లను త్వరితగతిన పూర్తి చేసి, 55 అసెంబ్లీ నియోజకవర్గాలను బహిరంగ విసర్జన లేని వాటిగా ప్రకటించాలని సిఎం అధికారులకు సూచించారు.