ఆంధ్రప్రదేశ్‌

పేలుళ్ల వెనుక ఎవరి హస్తం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 13: నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో సోమవారం జరిగిన బాంబు పేలుడు ఘటన తాలుకూ భయాందోళన నగర వాసుల్ని వీడలేదు. గతంలో ఎన్నడూ నెల్లూరు జిల్లాలో ఈ తరహా పేలుడు సంభవించిన దాఖలాలు లేవు. చాలా తక్కువ స్థాయి పేలుడు జరిగిందని, బాంబు సామర్థ్యం కూడా కొద్దిపాటిదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ వైపు జిల్లా పోలీస్ అధికారులు చెబుతున్నప్పటికి నగరవాసుల్లో మాత్రం వణుకు పోలేదు. జన సమ్మర్ధం లేకపోవడంతో సరిపోయింది కానీ, నగరంలో జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే చోట జరిగి ఉండే పరిస్థితి ఏమిటనే ఆలోచన తలచుకుంటేనే అందరిలో వణుకు పుడుతోంది. పోలీస్ శాఖ భద్రతా చర్యల విషయంలో మరింత పటిష్టమైన చర్యలతో ఉండాలని ఈ బాంబు పేలుడు చెప్పకనే చెబుతోంది.
బాంబు పేలుడు ఘటనపై పోలీస్ శాఖ అన్ని కోణాల్లో దర్యాప్తున ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులతో కూడిన బృందం మంగళవారం పేలుడు జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా పోలీసుల నుంచి వారు స్వాధీనం చేసుకున్న బాంబు, ప్రెషర్ కుక్కర్ శకలాలను వారు పరిశీలించారు. గతంలో చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోనూ ఇదే తరహా పేలుడు సంభవించి ఉండడంతో చిత్తూరు సిసిఎస్ డిఎస్పీ రామకృష్ణ కూడా మంగళవారం నెల్లూరు నగరానికి వచ్చి పేలుడు ప్రదేశాన్ని పరిశీలించి ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలోనే కాకుండా కర్నాటక రాష్ట్రం మైసూర్‌లోనూ, కేరళ రాష్ట్రంలో కొల్లాంలోనూ ఇదే తరహాలో కోర్టు ప్రాంగణంలో జరిగిన వివిధ బాంబు పేలుళ్లకు, ప్రస్తుతం నెల్లూరులో జరిగిన ప్రెషర్ కుక్కర్ బాంబు పేలుడుకు సారూప్యత ఉందనే అభిప్రాయానికి పోలీసులు వచ్చినట్లు సమాచారం. దర్యాప్తు విషయాలను వారు గోప్యంగా ఉంచుతుండడంతో ఎటువంటి సమాచారం వెల్లడి కావడం లేదు. విదేశీ తీవ్రవాద సంస్థల సానుభూతి పరులు ఈ తరహా పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందనే కోణంలోనూ నిఘా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇదే తరహాలో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. ఒకవేళ కక్షిదారులనో, కోర్టు సిబ్బందిలో ఎవరినైనా బెదిరించే క్రమంలో ఇటువంటి తక్కువ స్థాయి పేలుడుకు, జనసమ్మర్ధం లేని సమయంలో పాల్పడి ఉంటారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మైసూరు, కొల్లాం, చిత్తూరు, నెల్లూరు అన్ని ప్రాంతాల్లోనూ జిల్లా కోర్టు ప్రాంగణాలనే వేదికగా ఎంచుకోవడం వెనుక గల కారణాలను పరిశీలించాల్సి ఉంది.