ఆంధ్రప్రదేశ్‌

తగ్గిన శిశుమరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 13: ప్రజారోగ్యం కోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యంగా మాతా శిశు మరణాలు నిరోధించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు విజయవంతమవుతున్నాయి. పౌష్టికాహార లోపం, రక్తహీనత, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి కారణాలతో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న మాతా శిశు మరణాలు రాష్ట్భ్రావృద్ధిపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో సిఎం చంద్రబాబునాయుడు మాతా, శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోసాగారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో 2012-13లో ఆస్పత్రుల్లో 94.9 శాతం ఉన్న ప్రసవాల సంఖ్య 2015-16 నాటికి 98.3 శాతానికి చేరుకుంది. మహిళల్లో వ్యాధి నిరోధక శక్తి 95 శాతానికి పెరిగింది. కోరింత దగ్గు, మెదడు వాపు, కంఠసర్పి, కామెర్లు, ధనుర్వాతం వంటి ఐదు రకాల వ్యాధులను నియంత్రించడానికి ఒకే వ్యాక్సిన్ (పెంటావాలెంట్)ను అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
విరోచనాలు అరికట్టే రోటా వైరస్ వ్యాక్సిన్ కూడా లభించేలా చర్యలు తీసుకుంది. మాతా శిశు సంక్షేమానికి 2016-17 బడ్జెట్‌లో రూ.1331.73 కోట్లు కేటాయించింది. 108 సేవల కోసం రూ.53 కోట్లు, 104 సేవలకు రూ.45 కోట్లు వెచ్చిస్తోంది. అన్న అమృత హస్తం పథకం కింద 2015-16లో రూ.91.04 కోట్లతో 104 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 3.45 లక్షల మంది తల్లులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంది. 2016-17 బడ్జెట్‌లో ఐసిడిఎస్‌కు రూ.772 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్) కింద 8.56 లక్షల మంది గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోంది. గర్భిణులు, శిశువులకు అవసరమయ్యే అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. 102కు కాల్ చేయడం ద్వారా 24 గంటలూ ఎప్పుడైనా వైద్య సేవలు పొందే సౌకర్యం కల్పించింది.
రాష్ట్ర వ్యాప్తంగా జిపిఎస్ వ్యవస్థ కలిగిన తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ల పేరుతో 297 వాహనాలను అందుబాటులో ఉంచింది. ఈ వాహనాల ద్వారా ప్రభుత్వాస్పత్రులకు గర్భిణులను తీసుకువచ్చి ప్రసవం తర్వాత తల్లి, బిడ్డను క్షేమంగా తిరిగి ఇంటికి తీసుకెళతారు. ఈ సేవలన్నీ ఉచితంగా అందజేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1న మొదలైన ఈ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల సేవల ద్వారా ఇప్పటివరకూ లక్షా 23 వేల మందికి పైగా మాతృమూర్తులు లబ్ధి పొందారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మాతా శిశు మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకూ అనంతపురం జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో అత్యధికంగా 23,987 ప్రసవాలు జరిగాయి. అత్యల్పంగా కడపలో 10,528 ప్రసవాలు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 55 మాతృత్వ మరణాలు సంభవిస్తే, పశ్చిమ గోదావరిలో 13 మాత్రమే నమోదయ్యాయి. శిశు మరణాలు అనంతపురం జిల్లాలో 229, అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 39 మంది శిశువులు పురిటిలోనే ప్రాణాలొదిలారు.