ఆంధ్రప్రదేశ్‌

ఐఎన్‌ఎస్ విరాట్‌పై ఇఎన్‌సితో ఏపి సిఎం చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విరాట్ సేవల విరామం అనంతరం మ్యూజియంగా మార్చేందుకు ఎపి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా నగరంలో బుధవారం ఆయన తూర్పునౌకాదళం ప్రధానాధికారి హెచ్‌సిఎస్ బిస్త్‌తో కొద్దిసేపు చర్చించారు. ఇప్పటికే ఐఎన్‌ఎస్ కరుసుర జలాంతర్గామి సేవల అనంతరం విశాఖ ఆర్‌కె బీచ్‌లో మ్యూజియంగా ఏర్పాటు చేశామని వివరించారు. విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా కురుసుర సందర్శకులను ఆకట్టుకోవడంతో పాటు విజ్ఞానాన్ని పంచుతోందని వివరించారు. త్వరలోనే నౌకాదళం నుంచి సేవలు విరమించనున్న ఐఎన్‌ఎస్ విరాట్‌ను సందర్శకుల కోసం అందుబాటులోకి తీసుకురావాలన్న తమ అభిప్రాయాన్ని బిస్త్‌తో పంచుకున్నారు. దీనిపై సిఎం చంద్రబాబు, ఇఎన్‌సి చీఫ్ బిస్త్ సుమారు 15 నిముషాల పాటు చర్చించారు.

‘తృణధాన్యాలనూ పేదలకు ఇవ్వాలి’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 14: ప్రజాపంపిణీ విధానం (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం-పిడిఎస్) ద్వారా తృణధాన్యాలను (జొన్న, సజ్జ, రాగులు తదితరాలు) పేద ప్రజలకు సరఫరా చేయాలని దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డిడిఎస్) డిమాండ్ చేసింది. డిడిఎస్ నేషనల్ కన్వీనర్ పి.వి. సతీష్ ఈ మేరకు బుధవారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 ప్రకారం పిడిఎస్ ద్వారా బియ్యం కిలో మూడు రూపాయలకు, గోధుమ రెండు రూపాయలకు, తృణధాన్యాలను (జొన్న, సజ్జ, రాగులు తదితరాలు) కిలో రూపాయికి ఇవ్వాలని ఈ చట్టంలో పొందుపరిచారని గుర్తు చేశారు. ప్రస్తుతం బియ్యం, గోధుమ ఇస్తున్నప్పటికీ, తృణధాన్యాలను ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెంటనే తృణధాన్యాలను కూడా పిడిఎస్ ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.