ఆంధ్రప్రదేశ్‌

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. మంగళవారం సాయంత్రం సంక్రాంతి సంబరాలను మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా ముగ్గుల పోటీలను తిలకించారు. చిన్నారులకు భోగిపళ్లు పోశారు. గంగిరెద్దుల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. బొమ్మల కొలువును వీక్షించారు. గొబ్బి పాటలు పాడుతూ కోలాటంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసి చిన్నారులతో ముచ్చటించారు. సంక్రాంతి
సాంప్రదాయ పిండివంటల రుచిచూశారు. మేలుజాతి పాడిపశువుల స్టాళ్లను సందర్శించారు. హరిదాసు కీర్తనలు, భజనలు, గంగిరెద్దుల మేళం ప్రదర్శనలను చూశారు. మన దేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని, నేటితరం విద్యార్థులు వీటి గురించి తెలుసుకునేందుకు మంత్రి కొడాలి నాని సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అభినందించారు. మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
''చిత్రాలు..
పుంగనూరు ఎడ్లు, ఎడ్లబండిని ఆసక్తిగా చూస్తున్న ముఖ్యమంత్రి జగన్
గంగిరెద్దు విన్యాసాలను తిలకిస్తున్న ముఖ్యమంత్రి జగన్