ఆంధ్రప్రదేశ్‌

ఇక నిరంతర విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 16: విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింతగా పటిష్టపర్చడంలో భాగంగా వౌలిక సదుపాయాల అభివృద్ధికి రుణంగా రూ.2500 కోట్లు మంజూరు చేసేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించిందని రాష్ట్ర ఇంధన కార్యదర్శి అజయ్‌జైన్ పేర్కొన్నారు. ఈపిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైవోల్టోజీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (హెచ్‌విడిఎస్) స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, పంపిణీ వ్యవస్థలో వౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులు వెచ్చిస్తామన్నారు. ఇప్పటికే విశాఖ నగరంలో భూగర్భ విద్యుద్దీకరణ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంక్ రూ.700 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు ఖరారు కానున్నాయని, పనులు ప్రారంభించిన 18 మాసాల్లో పూర్తి అవుతాయన్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే నాణ్యమైన విద్యుత్ అందివ్వడంతోపాటు, 24 గంటల్లో సాంకేతికపరమైన సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. విద్యుత్ వినియోగదారునికి ప్రపంచస్థాయి సేవలందించడంలో భాగంగా ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌కు సంబందించిన వౌలిక సదుపాయాలను మరింతగా అభివృద్ధిపరుస్తున్నామన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న అవసరాలకనుగుణంగా ఎంత డిమాండ్ ఉన్నా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా అవసరమైన విద్యుత్ అందుబాటులో ఉంటుందన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 7,965 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, 22శాతం వృద్ధిగా 178 మిలియన్ల యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 7,391 మెగావాట్ల విద్యుత్ వినియోగమైందన్నారు. ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలు స్థాయి 2015-16 ఆర్థిక సంవత్సరంలో 10.2 శాతానికి తగ్గాయని, ఇది దేశంలోనే అతి స్వల్ప నష్టంగా రికార్డుల్లోకి ఎక్కిందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయగలిగామన్నారు. ఈ విధంగా దేశంలోనే మూడవ రాష్ట్రంగా గుర్తింపు పొందిందన్నారు. ఆన్‌లైన్ విధానం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తెలుసుకోవడం, వాటి పరిష్కారం గురించిన ఫీడర్ మోనటరింగ్ సిస్టమ్‌ను విజయవాడలో ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా ప్రారంభిస్తారన్నారు. స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎనర్జీ సిఆర్‌డిఏ ప్రజాసంబంధాల మీడియా అడ్వయిజర్ ఏ.చంద్రశేఖర్‌రెడ్డి, ఈపిడిసిఎల్ డైరెక్టర్ బొడ్డు శేషుకుమార్ పాల్గొన్నారు.