ఆంధ్రప్రదేశ్‌

ఈ ఏడాది నుంచే ‘విద్యా కానుక’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 21: విద్యా రంగంలో వినూత్న మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఇకపై ప్రతి ఏటా ‘విద్యా కానుక’ కింద కిట్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 1న 36 లక్షల మందికి వీటిని పంపిణీ చేస్తామన్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు మెరుగుపరచి, తగిన వసతుల కల్పించటంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన, డ్రాపవుట్లు తగ్గించటం ద్వారా అక్షరాస్యత శాతం పెంచాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంగళవారం శాసనసభలో అమ్మఒడి, నాడు- నేడు, ఆంగ్ల మాధ్యమంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమ్మఒడి ఓ చదువుల గుడి అని అభివర్ణించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 82 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌కు ఈ పథకం నిర్దేశించినట్లు చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 6028 కోట్లు జమ చేశామని వివరించారు. సాంకేతిక కారణాలతో లబ్ధి పొందని ఇతర తల్లులకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో తన పాదయాత్ర జనవరి 9తో ముగిసిందని ఈ ఏడాది అదే రోజున అమ్మఒడికి శ్రీకారం చుట్టటం ఆనందంగా ఉందన్నారు. పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మరిన్ని మార్పులు, చేర్పులు చేశామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించటం ద్వారా ఉన్నతమైన ఆలోచనలకు ప్రభుత్వం నాంది పలికిందన్నారు. గోరుముద్ద పేరిట ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. మెనూలో భారీగా మార్పులు తీసుకు వచ్చామని దీన్ని పర్యవేక్షించేందుకు నాలుగంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయాల జీతం రూ. 3 వేలకు పెంచడం ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ. 344 కోట్ల భారం పడుతుందని తెలిపారు. ప్రతి సోమవారం అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, స్వీట్, చిక్కీ, మంగళవారం టొమాటో పప్పు, ఉడికించిన గుడ్డు, పులిహోర, బుధవారం వెజిటబుల్ రైస్, ఆలు కూర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్, చిక్కీ, గురువారం కిచిడీ, టొమాటో చెట్నీ, గుడ్డు, శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్, చిక్కీ, శనివారం అన్నం, సాంబారు, పొంగల్, స్వీట్ అందిస్తామని వెల్లడించారు. పేరెంట్స్ కమిటీ నుంచి ముగ్గుర్ని ఎంపిక చేసి ఇండిపెండెంట్ ఆడిట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామన్నారు. కోడిగుడ్ల సరఫరాకు కూడా రివర్స్ టెండరింగ్ పద్ధతి అనుసరిస్తామని ఎక్కడ అవినీతి జరిగినా ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. నాడు- నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో సకల వసతులు కల్పిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45వేల పాఠశాలల రూపురేఖలు మార్చేస్తామని తెలిపారు. ఇకపై విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు కిట్లు పంపిణీ
చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 1న 36 లక్షల మందికి వీటిని అందిస్తామని ఇందులో 3 జతల యూనిఫాం, (టైలరింగ్‌కు అయ్యే ఖర్చు) సహా పుస్తకాలు, బూట్లు, సాక్సులు, బెల్ట్‌లతో కూడిన కిట్‌లను విద్యా కానుకగా అందజేస్తామని వివరించారు. ఒక్కో కిట్‌కు రూ. 1360 ఖర్చవుతుందని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా ఆంగ్ల మాధ్యమంలో బోధన అమల్లోకి తెస్తామన్నారు. ఈ ఏడాది 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల విద్యా బోధన జరుగుతుందని ఇప్పటికే ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. జనవరి నెలాఖరు నాటికి పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తవుతుందని, తెలుగు తప్పనిసరి సబ్జక్టుగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. విద్యా ప్రమాణాల మెరుగుదలలో భాగాంగా ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. ఇక 18 నుంచి 23 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు ఇంటర్మీడియట్ విద్య తరువాత పై చదువులకు వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చదువు అనేది పిల్లలకు ఇచ్చే ఆస్తి అని అప్పుడే వారి జీవితాలు బాగుపడతాయన్నారు. వచ్చే నెల నుంచి విద్యా దీవెన అమలు చేస్తామని ప్రకటించారు. వసతి దీవెనలో భాగంగా పిల్లల హాస్టల్, మెస్ చార్జీల కింద ఏటా రూ. 20వేలు తల్లులకు రెండు విడతలుగా అందిస్తామని తెలిపారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ. 10వేలు, జూలై లేదా ఆగస్టులో మరో 10వేలు అందుతాయన్నారు. ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీ యింబర్స్‌మెంట్‌తో విద్యా కానుక అమలు చేస్తామన్నారు.
'చిత్రం...ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి