ఆంధ్రప్రదేశ్‌

అమ్మఒడితో ముందస్తు సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 21: అమ్మఒడి పుట్టిన ప్రతి బిడ్డకూ తొలి బడి అని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కురసాల కన్నబాబు అభివర్ణించారు. మంగళ వారం శాసనసభలో పాఠశాల విద్య నాడు-నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన తదితర పథకాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అమ్మఒడి పథకం ఓ సంస్కరణ అని, విద్యా రంగంలో పెను విప్లవమన్నారు. భవిష్యత్‌లో మానవ వనరులను అందించే విషయంలో ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే నిరక్షరాస్యతను పూర్తి స్థాయిలో నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర భవిష్యత్‌తో పాటు భావితరాలను తీర్చి దిద్దే క్రమంలో నిర్దేశించగలిగే పథకమని వివరించారు. ఈ పథకం కింద రాష్టవ్య్రాప్తంగా 72,77,387 మంది విద్యార్థులు నమోదయ్యారని ఇప్పటి వరకు 41.6 లక్షల మంది తల్లులకు రూ. 15 వేల చొప్పున ఐదు రోజుల్లోనే నగదు జమ చేశామన్నారు. ఇందులో 7231 మంది అనాథలు ఉన్నారని వీరికి తల్లీ, తండ్రీ తానే అయి ముఖ్యమంత్రి జగన్ వారి సంరక్షకుల ఖాతాలో నగదు జమ చేయాలని ఆదేశించారన్నారు. ఈ పథకం పేదల కుటుంబాల్లో ముందస్తుగా సంక్రాంతిని నింపిందన్నారు. విద్యారంగంలో మరో సంస్కరణగా ఆంగ్ల మాధ్యమాన్ని ఈ సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు. దీనిపై రచ్చచేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తానే 2017లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టానని అసత్యాలు ప్రచారం చేస్తూ యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. మధ్యాహ్న భోజనం మెనూలో మార్పు ద్వారా పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించే వీలు కలుగుతోందని చెప్పారు. దీనివల్ల వారి ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడ గలవన్నారు. వౌలిక రంగాలైన విద్య, వ్యవసాయం, వైద్యంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. నాడు- నేడు కింద 15వేల పాఠశాలల్లో వసతుల కల్పనకై రూ 3600 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం పథకం గుడ్లు కూడా మెక్కేసారని ఆరోపించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా పారదర్శకంగా అమలు చేస్తుందని విద్యార్థులకు పోషక విలువలనిచ్చే చిక్కీని కొత్తగా ప్రవేశపెడుతున్నామని దీనివల్ల ప్రభుత్వంపై రూ. 136 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో 98.2 శాతం ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 27.28 శాతం మంది మాత్రమే చదువుతున్నారని వివరించారు. విద్యా రంగ సంస్కరణలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, విడదల రజని, కిలారి రోశయ్య, అదీప్‌రాజు స్పష్టం చేశారు.