ఆంధ్రప్రదేశ్‌

మూడు రాజధానులు ఓ విపరీత నిర్ణయం: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జనవరి 21: ఓ చిన్న పిల్లవాడు కూడా సీఎం డౌన్ డౌన్ అనడం ఏపీ ప్రజల మనోభావాలను చాటుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ఓ విపరీత నిర్ణయమన్న ఆయన దారుణ పర్యవసానాలు భరించక తప్పదని మంగళవారం ట్విట్టర్‌లో హెచ్చరించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు మాటల్లో వర్ణించలేనంత కష్టం అనుభవిస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం భవిష్యత్తు తరాలను కూడా అంధకారంలోనికి నెట్టనుందని ఆవేదన వ్యక్తం చేశారు.