ఆంధ్రప్రదేశ్‌

అధికార కేంద్రీకృతం అభివృద్ధికి విఘాతమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 23: అధికారం కేంద్రీకృతమైతే అభివృద్ధికి విఘాతమని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గుర్తించినందునే అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విద్యార్థి యువజన విభాగాల రాష్ట్ర నేతల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం రాజధాని అయితే వ్యయం తక్కువ అవుతుందని సీఎం గుర్తించారన్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో 90 శాతం మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. రాజధానిలో నాలుగు వేల ఎకరాలకు పైగా ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేసినట్లు బహిర్గతమైనా టీడీపీ నేతలు బుకాయించడం దుర్మార్గమన్నారు. గ్రీన్ ఫీల్డ్‌సిటీ కట్టాలంటే లక్షన్నర కోట్ల పెట్టుబడి అవసరమని, అంత పెట్టుబడి పెట్టే స్థితిలో రాష్ట్రం లేదు కదా అన్నారు. ప్రభుత్వ విధానాల పై యూనివర్శిటీల్లోను, విద్యా సంస్థల్లోను సెమినార్‌లు, సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పాల్గొన్నారు.
టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తాం
తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు వైసీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నట్లు పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విద్యార్థి యువజన విభాగం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 30వ తేదీ వరకు విద్యాలయాలు, యూనివర్శిటీలు, ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తామన్నారు. 29న రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లలో సంతకాల సేకరణ, 30న రాష్టప్రతికి పోస్టు కార్డుల ఉద్యమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.