ఆంధ్రప్రదేశ్‌

పెద్దల సభపై విశ్వాసం పోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 23: శాసన మండలిలో టీడీపీ నాయకులు వ్యవహరించిన తీరుతో పెద్దల సభపై పూర్తిగా విశ్వాసం పోయిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసన మండలి నిబంధనలను తుంగలోకి తొక్కి రూలింగ్ ఇచ్చారని, కనీసం సభ్యుల అభ్యంతరాలను పరిశీలించకుండానే మండలి చైర్మన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. కేవలం చంద్రబాబు ఒత్తిడి కారణంగానే చైర్మన్ ఈ విధంగా సెలక్ట్ కమిటీకి బిల్‌ను పంపారని ఆరోపించారు. అప్రజాస్వామికంగా సభలో సభ్యుల సలహాలు, సూచనలు స్వీకరించకుండా కమిటీని ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన కమిటీ ఎన్ని రోజుల్లో నివేదిక అందిస్తుందో ఆయా వివరాలను సైతం వెల్లడించలేదని, వాస్తవానికి ఏ కమిటీ అయినా ఏదైనా బిల్లుపై మూడు నెలల గడువులోగా పూర్తిస్థాయిలో చర్చించి మండలికి నివేదిక అందించాలని, కానీ టీడీపీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాజ్యంగ ప్రతిష్టంభన సృష్టించడమే టీడీపీ లక్ష్యంగా పెట్టుకుందని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే శాసనసభ, మండలి సభ్యులతో కూడిన జాయింట్ సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేసేవారన్నారు. మండలిలో ఎమ్మెల్సీలు లోకల్ రౌడీలుగా, చంద్రబాబు స్టేట్ రౌడీగా ప్రవర్తించారని ఆరోపించారు. ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నాయకులు చంద్రబాబు భజన మాని ఆయా ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిసారించాలన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ విషయంపై పూర్తిస్థాయిలో సీబీఐ విచారణ చేపట్టాలని, చంద్రబాబు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలన్నారు.