ఆంధ్రప్రదేశ్‌

కేసులు ముంచుకొస్తుండడంతో జగన్‌లో తత్తరపాటు: వర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 25: కేసుల విచారణ ముంచుకొస్తుండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిలో తత్తరపాటు, కలవరం మొదలైందని ఆ కంగారులోనే ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియని అయోమయ వ్యవస్థలో ఆయన ఉన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. శనివారం మంగళగిరి సమీపంలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత మే 30 నుంచి ఈ ఏడాది జనవరి 25 వరకు 30 శుక్రవారాలు వస్తే ఒక్క వారమే జగన్ కోర్టుకు హాజరయ్యారన్నారు. దీంతో ఆగ్రహించిన సీబీఐ న్యాయస్థానం ఇకపై తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేయడంతో జగన్‌లో భయం ఏర్పడిందన్నారు.