ఆంధ్రప్రదేశ్‌

ఇక ఇంటికే పింఛన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 28: ఎన్నికల్లో ఓట్లే మనకు ప్రామాణికం కాదు.. పేదలందరికీ మంచి జరగాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉగాది నాడు మహిళల పేరుతో ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని నిర్దేశించారు. ‘స్పందన’ కార్యక్రమంపై మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పథకాలకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్పందన కింద వచ్చే దరఖాస్తుల్లో 60 శాతం బియ్యం కార్డులు, పింఛన్లు, ఇళ్లకు సంబంధించినవే అన్నారు. కార్యక్రమం అమల్లో అధికారుల పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై దరఖాస్తులకు సంబంధించి కార్డులు జారీ చేయాల్సి ఉందన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మొత్తంగా 54.64 లక్షల మందికి పైగా పింఛన్లు మంజూరు చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు 39 లక్షలుగా ఉన్న పింఛన్లు ఇప్పుడు 54 లక్షలు దాటాయని తెలిపారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంటివద్దనే పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయాల్లో పింఛన్లు, రేషన్ కార్డులకు సంబంధించి అర్హుల జాబితాను ప్రదర్శించిందీ లేనిదీ కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు కొత్త పింఛన్లు, బియ్యం కార్డులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అప్పటికల్లా కార్డులు ముద్రించి సిద్ధం చేసుకోవాలన్నారు. బియ్యం కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారి సామాజిక తనిఖీ పూర్తి చేసి ఫిబ్రవరి 2 కల్లా పంపాలన్నారు. ఆ తరువాత 15 వ తేదీ నుంచి కొత్త కార్డులు పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు. ఇంకా అర్హులు మిగిలి ఉంటే వారికి గ్రామ సచివాలయాల ద్వారా కొత్త కార్డులు నిరంతర ప్రక్రియగా నిర్వహించాలన్నారు. నిర్దేశించిన సమయంలోగా కార్డులు అందాలన్నారు. బియ్యం కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఐదు రోజుల్లోగా గ్రామ సచివాలయాల ద్వారా కార్డులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. కొత్త వారికి కూడా ఫిబ్రవరి 1 నుంచి పింఛన్లు అందించాలన్నారు.
మహిళలకే ఇళ్లపట్టాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది నాటికి 25 లక్షల మందికి మహిళల పేరిటే రూ. 10 రూపాయల స్టాంప్ పేపర్‌పై ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఎవరికి దరఖాస్తు చేయాలనే వివరాలను కూడా గ్రామ సచివాలయాల్లో డిస్‌ప్లే చేశామని అధికారులు వివరించారు. లాటరీ పద్ధతి ద్వారా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫిబ్రవరి 15 లోగా ఇళ్ల పట్టాల అర్హుల జాబితా సిద్ధం చేయాలన్నారు. ప్రజా సాధికార సర్వేకు, ఇళ్ల పట్టాల మంజూరుకు లింక్ పెట్టరాదని స్పష్టం చేశారు. ఎవరికైనా ఇళ్లు ఇస్తే 2006 నుంచి ప్రభుత్వం వద్ద డేటా ఉందని కేవలం ఆ డేటాతో మాత్రమే తనిఖీ చేయాలని సూచించారు. గ్రామాల పర్యటన సందర్భంగా ఇంటి స్థలం లేనివారు ఉండరాదన్నారు. ఎవరికీ అన్యాయం జరిగిందనే అపవాదులు లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వదలుచుకున్న స్థలాలను ఖరారు చేసే ముందు లబ్ధిదారుల్లో మెజారిటీ ప్రజల అంగీకారం పొందాలన్నారు. మొక్కుబడిగా ఇస్తే ఎవరూ ఆ స్థలాల్లో నివసించేందుకు ఇష్టపడరని, లబ్ధిదారుడు సంతోషంగా ఉంటామని సుముఖత వ్యక్తం చేశాకే నిర్ణయం తీసుకోవాలని వివరించారు. అలా చేయకపోతే డబ్బు వృథాతో పాటు లబ్ధిదారులకు అసంతృప్తి మిగులుతుందని వివరించారు. ప్లాటింగ్ చేసే సమయంలో ఈ అంశాలను కలెక్టర్లు కచ్చితంగా పాటించాలన్నారు. గ్రామానికి దూరంలో, నివాస యోగ్యంకాని ప్రాంతాల్లో పట్టాలు పంపిణీ చేసినందువల్ల ప్రయోజనం ఉండదన్నారు. ఫిబ్రవరి 15 కల్లా జాబితా సిద్ధం చేయాలని, 21వ తేదీకి లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వానికి కలెక్టర్లు అందజేయాలని
ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్ల అభివృద్ధి 25వ తేదీ కల్లా పూర్తి చేయాలన్నారు. మార్చి ఒకటో తేదీ నాటికి భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. 15వ తేదీతో లాటరీ పూర్తిచేసి ప్లాట్ల కేటాయింపు జరపాలన్నారు. అభ్యంతరకర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్లాట్లు ఎక్కడ కేటాయిస్తున్నదీ అందరికీ వివరించాలన్నారు. ఆ ప్లాట్ల పట్ల వారి అంగీకారాన్ని తీసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి చేపట్టనున్న మొదటి దశ ఇళ్ల నిర్మాణంలో వీరికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన తరువాతే అభ్యంతరకర ప్రాంతాల్లో ఉన్న వారిని తరలించాలని, అభ్యంతరాల్లేని ప్రాంతాల్లో రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు. దీన్ని కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు. దాపరికం లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేయాలన్నారు. ఓటు వేయకపోయినా సరే వారికి మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని భవిష్యత్ తరాలు ప్రభుత్వాన్ని, అధికారులను గుర్తుంచుకునేలా విజయవంతం చేయాలన్నారు.

వచ్చేనెల 28న విద్యా వసతి దీవెన
విద్యా వసతి దీవెన పథకాన్ని ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభించాలని, రెండో విడతగా జూలై, ఆగస్టులో చెల్లింపులు జరపాలని సీఎం ఆదేశించారు. విద్యార్థులకు బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కింద తల్లులకు నగదు బదిలీ చేయాలన్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ. 10వేలు, పాలిటెక్నిక్‌కు రూ. 15వేలు, డిగ్రీ, ఇతర కోర్సులకు ఏడాదికి రూ. 20 వేల చొప్పున తల్లుల ఖాతాలో జమ చేయాలన్నారు. సుమారు 11 లక్షల మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరాలన్నారు.

రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు పూర్తి కావాలి
గ్రామ సచివాలయాల చెంతనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కావాలని పునరుద్ఘాటించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి 11 వేలకు పైగా కేంద్రాలు నెలకొల్పాలని నిర్దేశించారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చే ప్రాజెక్ట్ అన్నారు. నాణ్యమైన పురుగుమందులు, విత్తనాలు, ఎరువులు గ్రామ స్థాయిలో రైతులకు అందాలన్నారు. రైతు పంటవేసే సమయానికి కనీస గిట్టుబాటు ధరలు ప్రకటిస్తామని, ధరలు తగ్గితే ప్రభుత్వమే జోక్యం చేసుకుని రైతులను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. దీనివల్ల మార్కెట్‌లో పోటీ కూడా పెరుగుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెస్తామన్నారు. పశువులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు. గ్రీన్, బ్లూ, వైట్ రెవెల్యూషన్‌కు ఇవి ఎంతో కీలకమన్నారు. వచ్చేనెల 28న 3300 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. వీటికి కలెక్టర్లే భవనాలను సిద్ధం చేయాలన్నారు. మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను శాశ్వతంగా గ్రామ సచివాలయాల్లో ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించాలన్నారు.

సచివాలయాల్లో 541 సేవలు
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 336 సేవలు 72 గంటల్లో పూర్తి చేయాలని నిర్దేశించుకున్నామని, మిగిలిన సేవలు ఎప్పటిలోగా అందుతాయో కూడా లక్ష్యాలకు అనుగుణంగా నిర్దేశించినట్లు చెప్పారు. ఈ సేవల వివరాలు సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు. వీటితో పాటు వివిధ పథకాల లబ్ధిదారుల జాబితా,అర్హతలు ప్రదర్శించాలని సూచించారు. కలెక్టర్లు నేరుగా సచివాలయాల పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల పర్యవేక్షణ బాధ్యతలను జేసీలకు అప్పగించాలని సూచించారు.

వైఎస్సార్ కంటి వెలుగు
వచ్చేనెల 1వ తేదీ నుంచి వైఎస్సార్ కంటి వెలుగు మూడోవిడత కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సుమారు కోటీ పాతిక లక్షల మందికి స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించారు. జూలై 31వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించాలని వచ్చేనెల 15 నుంచి ఆరోగ్య కార్డులు జారీ చేయాలన్నారు. ఇప్పటి వరకు 66,15,467 మంది పిల్లలకు కంటి పరీక్షలు లక్షన్నర మందికి కంటి అద్దాలు పంపిణీ చేశామని వివరించారు. ఫిబ్రవరిలో 4906 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణానికి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

అమ్మఒడికి అవాంతరాలు తొలగించండి
అమ్మఒడి కింద 42,33,098 మంది లబ్ధిదారులను గుర్తించామని ఇప్పటి వరకు 41,25,808 మందికి రూ. 6188 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. ఇంకా 1,07,290 మంది ఖాతాల్లో సాంకేతిక ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. బ్యాంక్ ఖాతాలు ఎందుకు విఫలమవుతున్నాయో గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వివరాల నమోదులో తప్పుల కారణంగానే ఫెయిల్ అవుతున్నాయని వారం రోజుల్లోగా దీన్ని సరిదిద్దుతామని అధికారులు వివరణ ఇచ్చారు. మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలని సెర్ప్ అధికారులు దీన్ని పర్యవేక్షించాలన్నారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలన్నారు.

ఇసుక డోర్ డెలివరీ
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,12,082 టన్నుల ఇసుక డోర్ డెలివరీ చేశామన్నారు. ఈ నెల 30న అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో, ఫిబ్రవరి 7 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, 14 నుంచి గుంటూరు, చిత్తూరు, కర్నూలులో ప్రారంభించాలని ఆదేశించారు. ప్రస్తుతం 16.5 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం వచ్చే సరికి 60 నుంచి 70 లక్షల టన్నులు నిల్వచేయాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు 389 చెక్‌పోస్టులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వచ్చే నెల 4వ తేదీ నాటికి అన్ని చెక్‌పోస్టుల నుంచి ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

దిశ పోలీస్ స్టేషన్లపై ఆరా
రాష్ట్రంలో దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఫిబ్రవరి మొదటి వారానికి రాజమండ్రి, విజయనగరంలో దిశ పోలీస్ స్టేషన్లు సిద్ధమవుతాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. రెండో వారంలో మిగిలినవి పూర్తవుతాయని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. దేశం మొత్తం చర్చించే విధంగా దిశ చట్టం అమలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. వచ్చే మూడు నెలల్లో ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటవుతాయని అధికారులు తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్, జిల్లాకో కోర్టు, ఆస్పుత్రుల్లో వన్‌స్టాప్ సెంటర్లు తక్షణమే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ఎస్పీ బాధితుల ఇంటికి వెళ్లి అండగా నిలవాలన్నారు.

ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్
ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుతో మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా కట్టడి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. లంచగొండితనం లేకుండా జీతం పూర్తి స్థాయిలో నేరుగా ఉద్యోగికే అందేలా కోత లేకుండా అవినీతి తావివ్వకుండా మేలు చేస్తామని ప్రకటించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పునరుద్ఘాటించారు.
*చిత్రం...ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి