ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ రూపకల్పనపై సీఎస్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 28: రాష్ట్రంలో ఖాళీగా ఉండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీ చేయాల్సిన వివిధ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమీక్షించారు. వెలగపూడి సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో ఈ అంశంపై ఆమె సమీక్షించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉండి, నేరుగా భర్తీ చేయాల్సిన ఖాళీలను గుర్తించాలని ఆదేశించారు. ఈ వివరాలను ఏపీపీఎస్సీకి అందచేస్తే, క్యాలెండర్ రూపకల్పనకు వీలు అవుతుందన్నారు. వెంటనే వివిధ శాఖల అధికారులు తమ శాఖల్లోని ఖాళీల వివరాలను ఏపీపీఎస్సీకి అందించాలని కోరారు. ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్, సతీష్ చంద్ర, కరికాల వలవన్ పాల్గొన్నారు.

*చిత్రం...ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌పై సమీక్షిస్తున్న సీఎస్ నీలం సాహ్ని