ఆంధ్రప్రదేశ్‌

సీఎంవో అర్జీలపై సకాలంలో స్పందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 28: ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి వచ్చే వివిధ ఫిర్యాదులు, అర్జీలపై సకాలంలో స్పందించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు.
వెలగపూడి సచివాలయంలో సీఎంవోకి వచ్చే ఫిర్యాదులు, అర్జీలపై వివిధ శాఖల కార్యదర్శులతో ఆమె మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రజల నుంచి అందే అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలన్నారు.
ఇప్పటి వరకూ 1700 ఫిర్యాదులు, అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి ప్రాధాన్యత ఆధారంగా ఆయా శాఖలకు ఇప్పటికే వాటిని పంపామన్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించి ఈ-ఆఫీస్ ద్వారా నివేదిక పంపాలని తెలిపారు. సీఎంవోకి వచ్చే ఫిర్యాదులు, అర్జీలపై ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లం మాట్లాడుతూ సీఎంవో పంపే ఫిర్యాదులు, అర్జీలను ప్రాధాన్యత ఇచ్చి, పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు శామ్యూల్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్, సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.