ఆంధ్రప్రదేశ్‌

అయ్యా.. నాకు పెన్షన్ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, సెప్టెంబర్ 19: ప్రభుత్వం నుంచి ఏ చిన్న ఆర్థికసాయం అందినా అదే పదివేలనుకుని, సాయం కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూసే ప్రస్తుత కాలంలో పెన్షన్ వాపసు తీసుకోండంటూ అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు ఓ లబ్దిదారుడు. కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆదోని పట్టణంలోని 4వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్, టిడిపి సీనియర్ నాయకుడు, వృద్దాప్య పెన్షన్‌దారుడు పొంపన్న సోమవారం మున్సిపల్ కమిషనర్ గోవిందప్పను కలిసి తనకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ రద్దు చేయాలని అర్జీ అందజేశాడు. ఈ సందర్భంగా పొంపన్న మాట్లాడుతూ తాను చేనేత కార్మికుడినని, 1995లో 4వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యానన్నారు. 2014 వరకు మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నానన్నారు. శక్తి ఉన్నంత వరకు పనిచేసి పిల్లలను పెంచి పెద్దచేసి మంచి చదువులు చెప్పించానన్నారు. పని చేయడానికి శరీరం సహకరించకపోవడంతో 2014లో ప్రభుత్వం అందించే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నానన్నారు. 2015 జూన్ నెలలో పెన్షన్ మంజూరైందని వివరించాడు. ప్రస్తుతం తన ఇద్దరు కుమారులు వ్యాపారం చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారని, తనకు అన్నివిధాలుగా సహకరిస్తున్నారన్నారు. ప్రస్తుతం తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడిందన్నారు. అందుకే ప్రభుత్వం అందజేస్తున్న వృద్దాప్య పెన్షన్ వెనక్కు వాపసు చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. అందులో భాగంగానే సోమవారం మున్సిపల్ కమిషనర్‌ను కలిసి అర్జీ అందచేశానన్నారు. తన పెన్షన్ రద్దుచేసి అర్హులైన మరొకరికి అందించాలని అధికారులను కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పొంపన్నను కమిషనర్ గోవిందప్ప ప్రత్యేకంగా అభినందించారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న వారు పొంపన్నను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వారి పెన్షన్ వాపసు చేసి అర్హులకు అందిచేందుకు సహకరించాలని కోరారు.

చిత్రం.. ఆదోని మున్సిపల్ కమిషనర్‌కు అర్జీ అందచేస్తున్న పొంపన్న