ఆంధ్రప్రదేశ్‌

దొందూ దొందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: టిడిపి, బిజెపి వేర్వేరు కావని, రెండూ ఒకటేనని, రెండింటి బాట, భాష ఒకటేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. బిజెపి తల్లివంటిదైతే టిడిపి పిల్ల వంటిదని సోమవారం నాడిక్కడ పిసిసి భవన్‌లో 27 మాసాల తెలుగుదేశం పాలనపై ఒక వాస్తవ పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ ఆయనన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంకా 33 మాసాల కాలం మిగిలి వుందన్నారు. రాష్ట్రంలో టిడిపి ఏమికోరుతుందో కేంద్రంలో బిజెపి అదే ప్రకటిస్తుందని విమర్శించారు. వారికి సొంత ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఏమాత్రం పట్టడం లేదన్నారు. అందుకే ఈ నెల 28న తిరుపతిలో ప్రజాబ్యాలెట్‌తో ప్రజల వద్దకు వెళుతున్నామని చెప్పారు. రెండే రెండు అంశాలపై ప్రజాబ్యాలెట్ వుంటుందంటూ ప్రజలందరూ భాగస్వాములు కావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలా, వద్దా?’, 2014 ఎన్నికల సమయంలో టిడిపి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందా, లేదా?’ అనే రెండు అంశాలతోనే ప్రజల వద్దకు వెళుతున్నామని చెప్పారు. 2019లో రాహుల్ గాంధీ ప్రధాని అయిన తరువాత ప్రత్యేక హోదా ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలన తీరు మోసం, దగా, వంచన, ద్రోహం తప్ప మరేమీ కాదన్నారు. ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న.. అనే చందంగా రెండు పార్టీలు హోదా అమలు చేయకుండా ద్రోహం తలపెట్టాయన్నారు. మరోవైపు అవినీతి ఏరులై పారుతోందన్నారు. టిడిపి తమ 50 పేజీల ఎన్నికల ప్రణాళికలో 600 హామీలు ఇచ్చిందని, అందులో ఏదీ సక్రమంగా నెరవేర్చటం లేదన్నారు. తమ పోరాటాలకు భయపడి ఆ ప్రణాళికను పార్టీ వెబ్‌సైట్ నుంచి తొలగించారని విమర్శించారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడాలని చంద్రబాబు కేంద్రం ముందు మోకరిల్లాడంటూ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. పిసిసి ప్రధాన కార్యదర్శులు జంగా గౌతమ్, టిజెఆర్ సుధాకరబాబు, మీసాల రాజేశ్వరరావు, రాజీవ్ రతన్, పార్టీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, జిల్లా, నగర అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్, మల్లాది విష్ణు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, పాల్గొన్నారు.