ఆంధ్రప్రదేశ్‌

నినాదాల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 19: తాము అన్ని రంగాల్లో వెనుకబడి దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని, తమను బిసిలో చేర్చాలంటూ బలిజ కాపునేతలు, అన్నివిధాలా ఎంతో అభివృద్ధిలో ఉన్న బలిజ కాపులను బిసి జాబితాలో చేర్చి తమ గొంతు కోయొద్దని బిసి సంఘ నేతలు జస్టిస్ మంజునాథ్ కమిషన్‌కు తమ వాదనలు వినిపిస్తూ వినతిపత్రం సమర్పించారు. కాపులను బిసి కులాల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ మంజునాథ కమిటీ రెండురోజలు పర్యటనలో భాగంగా సోమవారం నగర పాలకసంస్థలోని వైఎస్‌ఆర్ మందిరంలో బహిరంగంగా ప్రజాభిప్రాయాలు సేకరించి వారి వాదనలు ఓపికతో వింది. మధ్యాహ్నం 12గంటలవరకు సాఫీగా సాగిన ఈ కార్యక్రమం బిసి, బలిజ సంఘ నేతల మధ్య పరస్పరం తమ వాదనలతో నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఒక దశలో కొద్దిపాటి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు ధర్నా చేస్తూ ఆందోళనకు దిగారు. అప్పటి వరకు సంయమనం పాటించిన పోలీసులు పరిస్థితి చేయిదాటుతుందని భావించి ఆందోళన కారులను అదుపులోకి తీసుకొని వాహనాల్లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
జిల్లాల వారీగా అభిప్రాయాలు సేకరణ
తిరుమల,: కాపులను బీసీ కులాల్లో చేర్చే అంశంపై జిల్లాల వారీగా ప్రజలందరి వద్ద అభిప్రాయాలను సేకరించాక త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కాపు కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ వెల్లడించారు. సోమవారం ఉదయం కాపు కమిషన్ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కాపులను బీసీ కులాల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాపు కమిషన్ కమిటీ తరపున సోమవారం తిరుపతిలోని నగర పాలక సంస్థ కార్యాలయంలో వినతులు స్వీకరించి, ప్రజాభిప్రాయాలు సేకరించమన్నారు. రాష్ట్రంలో బిసి కులాల్లో మార్పులు, చేర్పులు, ఆయా కులాల్లోని వ్యక్తుల సామాజిక, ఆర్థిక విద్యాపరమైన అంశాలను అధ్యయనం చేసి ప్రతి జిల్లా కేంద్రంలో ప్రజలను కలిసి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. కమిటీ అభిప్రాయ సేకరణ పూర్తయిన తరువాత అధ్యయనం చేశాక ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అన్నారు.