ఆంధ్రప్రదేశ్‌

ఇసుక అక్రమాలపై ఏపీఎండీసీలో కదలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 16: ప్రస్తుతం గోదావరి నదిలో ఇసుక విచక్షణా రహిత తవ్వకాలపై ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) భయం వెంటాడుతున్నట్టుగా ఉంది. ఇసుక కొరతను అధిగమించేందుకు ఎడా పెడా అనుమతులిచ్చేసి ఎక్కడబడితే అక్కడ తవ్వేసిన వైనాల నేపధ్యంలో ఈ భయం వెంటాడుతున్నట్టుగా ఉంది. ప్రస్తుతం ఇసుక అక్రమాలపై ఏపీ ఎండీసీలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఇసుక రవాణా, ర్యాంపుపై ఏపీ ఎండీసీ విజిలెన్స్ యంత్రాంగం నిఘా పెట్టింది. గత శనివారం ఏపీ ఎండీసీ ఎండీ మధుసూధనరెడ్డి తూర్పుగోదావరి జిల్లా వచ్చి యంత్రాంగంతో సమావేశం పెట్టి తగిన సూచనలు సలహాలు తెలియజేసి అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించినట్టు తెలిసింది.
అప్పటి నుంచి కడప నుంచి వచ్చిన విజిలెన్స్ ప్రత్యేక అధికారి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇసుక తవ్వకాలు, రవాణా, ర్యాంపుల నిర్వహణ తదితర అంశాలపై నిఘా పెట్టారు. కొంతమంది ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఈ ర్యాంపుల వెనుక ఉందని ప్రభుత్వానికి తెలియజేసినట్టు తెలిసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా ప్రతినిధుల పేరు చెప్పి కొంత మంది చక్రం తిప్పుతున్నారని ఆయా ప్రతినిధుల దృష్టికి ఏపీ ఎండిసీ విజిలెన్స్ తీసుకెళ్లినట్టు తెలిసింది.
ప్రధానంగా ఒక బిల్లుపై నాలుగైదు లారీల లోడు తరలించడం, బిల్లులు లేకుండా రవాణా చేయడం, బిల్లు కంటే అదనపు లోడు వేయడం తదితర అంశాలను ఏపీ ఎండీసీ విజిలెన్స్ ఇప్పటికే పసిగట్టునట్టు తెలిసింది. కడప నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారి ఉభయ గోదావరి జిల్లాల్లోని ర్యాంపులను పహారా కాస్తున్నట్టు తెలిసింది. రానున్న వర్షాకాలంలో ఇసుక ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు పెంచాలని ఏపీ ఎండిసీ ఎండి సమీక్షించి ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న స్టాక్ పాయింట్లలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలను చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రస్తుతం అనుమతిలో ఉన్న ఇసుక ర్యాంపులతోపాటు కొత్త ర్యాంపులను కూడా అనే్వషించి వర్షాకాల వత్తిడిని తట్టుకునేందుకు కొత్త ర్యాంపుల్లో ఇసుక వెలికితీత చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త ర్యాంపులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. గత కొంత కాలంగా మూసివేసిన అఖండ గోదావరి నది ఎడమ గట్టు వైపు డీసిల్టేషన్ ర్యాంపులను తిరిగి గత రెండు రోజుల నుంచి తెరిచారు. స్థానికంగా ఇసుకకు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా ఇతర జిల్లాలకు వెళ్లకుండా ఇసుక రవాణా నిలుపుదల చేశారు.
ముందు స్థానిక అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా అయ్యే పరిస్థితి వచ్చిన తర్వాత ఇతర జిల్లాలకు రవాణా జరిగే విధంగా చర్యలు చేపట్టారు. ఏదేమైనప్పటికీ ప్రత్యేక స్క్వాడ్‌లు, విజిలెన్స్ నిఘా పెంచి గోదావరి జిల్లాల్లో ఇసుక అక్రమాలకు చెక్ పెడుతున్నారు. ఇవి ఎంత వరకు ఫలితానిస్తాయో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు నూతన ఇసుక పాలసీల్లో బాలారిష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్జీటీ కేసుల భయంతో ముందు అక్రమాలపైనే ఏపీ ఎండీసీ దృష్టి సారించినట్టుంది.