ఆంధ్రప్రదేశ్‌

మా ఆస్తులు ఇవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: దేశంలో ఏ రాజకీయ కుటుంబం కూడా ప్రకటించని విధంగా గత తొమ్మిది సంవత్సరాల నుండి తమ కుటుంబ ఆస్తులను ప్రకటిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ స్పష్టంచేశారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో తమ కుటుంబ ఆస్తుల వివరాలను లోకేష్ ప్రకటించారు. మార్కెట్ విలువ తగ్గుతూ, పెరుగుతూ ఉంటుందని, ఏ ధరలకైతే ఆస్తులు కొన్నామో అవే వివరాలను తాము ప్రకటిస్తున్నామని స్పష్టంచేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మైనింగ్ మాఫియా, క్విడ్ ప్రోకో ద్వారా తమ కుటుంబం ఆస్తులు సంపాదించలేదన్నారు. రాజకీయాలపై ఆధారపడకుండా చంద్రబాబు 27 సంవత్సరాల క్రితమే హెరిటేజ్‌ను స్థాపించారన్నారు. అప్పటి నుండి ఇప్పటివరకు పారదర్శకంగా వ్యాపారాన్ని సంస్థ నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగానే హెరిటేజ్ సంస్థ రాజధాని అమరావతికి 20 కిలోమీటర్ల దూరంలో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ అంశాన్ని కొనుగోలు చేసిన సమయంలో విడుదల చేసిన బ్యాలెన్స్ షీటులో చూపించామని గుర్తుచేశారు. గత ఏడాది 2,500 కోట్ల టర్నోవర్ వస్తే రూ.83 కోట్ల లాభం హెరిటేజ్‌కు వచ్చిందన్నారు. మూడు రాష్ట్రాల్లో 9 వేల మంది రైతులతో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు 15 రాష్ట్రాల్లో విక్రయిస్తూ
33 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. మహిళలు పారిశ్రామిక వేత్తలు అయితే ఎంతటి అద్భుతాలు సాధించగలరో చెప్పడానికి నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలే నిదర్శనమన్నారు. 23 సంవత్సరాల క్రితం స్థాపించిన ఎన్‌టిఆర్ ట్రస్ట్ ఇరు రాష్ట్రాల్లోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా స్పందిస్తోందన్నారు. ఇక తమ వ్యక్తిగత ఆస్తుల వివరాలను పరిశీలిస్తే తన తండ్రి చంద్రబాబు నాయుడు ఆస్తులు 9 కోట్ల రూపాయలు కాగా, అప్పులు రూ.5.13 కోట్లు ఉన్నాయన్నారు. నికర ఆస్తులు రూ.3.87 కోట్లు అని చెప్పారు. తన తల్లి నారా భువనేశ్వరికి సంబంధించి ఆస్తులు రూ.50.62 కోట్లుగా ఆయన పేర్కొన్నారు. గత ఏడాదిలో ఆమె ఆస్తుల విలువ రూ.3 కోట్లకు తగ్గిందన్నారు. తన ఆస్తుల విలువ రూ.8.14 కోట్లుగా లోకేష్ తెలిపారు. తన పేరిట ఉన్న షేర్లను బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చానని గతం కంటే తన ఆస్తి రూ.2.40 కోట్లు తగ్గిందని వివరించారు. తన సతీమణి నారా బ్రాహ్మణి ఆస్తులు రూ.24.70 కోట్లు కాగా, తన కుమారుడు దేవాన్ష్ ఆస్తులు రూ.19.42 కోట్లుగా లోకేష్ పేర్కొన్నారు. ప్రకటించిన దాని కంటే రూపాయి ఎక్కువ ఉన్నా, గజం భూమి ఉందని నిరూపించినా తిరిగి ఇచ్చేస్తానని లోకేష్ స్పష్టంచేశారు.
*చిత్రం... కుటుంబ ఆస్తులు ప్రకటిస్తున్న లోకేష్