ఆంధ్రప్రదేశ్‌

బాలికల హాస్టల్ గదిలోకి విద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, ఫిబ్రవరి 22: రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అదే తరగతి చదువుతున్న విద్యార్థిని ఉండే బాలికల హాస్టల్లోకి రాత్రివేళ కిటికీ గ్రిల్ తొలగించి వెళ్ళిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 16వ తేదీ రాత్రి సమయంలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి అదే తరగతిలో చదువుతున్న విద్యార్థిని కోసం ఆమె ఉండే వసతిగృహ సముదాయానికి వెళ్ళాడు. సెక్యూరిటీ అంతంతమాత్రంగానే ఉండటంతో తలుపులు తీయకుండా కిటికీకి ఉన్న గ్రిల్ తొలగించి గదిలోకి వెళ్ళాడు. అక్కడే రాత్రంతా ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం ఆ విద్యార్థిని, విద్యార్థినిని లోపలే ఉంచి మిగిలిన విద్యార్థినులు రూమ్‌కు తాళం వేసి తరగతులకు వెళ్లిపోయారు. ఈ విషయం సహచర విద్యార్థుల ద్వారా ట్రిపుల్ ఐటీలోని అధ్యాపకులకు, అధికారులకు తెలియటంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బందితో సంబంధిత రూమ్ తాళాలను పగులకొట్టించారు. లోనికి ప్రవేశించిన సెక్యూరిటీ సిబ్బంది మంచాల కింద వెతకగా అక్కడ దాక్కున్న ఇద్దరినీ అధికారులకు అప్పగించారు. దీంతో ట్రిపుల్ ఐటీ అధికారులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి, వారి తల్లితండ్రులను పిలిపించి, ఇంటికి పంపించారు. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని డిసిప్లినరీ కమిటీని ఆదేశించినట్లు ట్రిపుల్ ఐటీ అధికారులు శనివారం విలేఖరులకు తెలిపారు. ఈ సంఘటనను విశ్వవిద్యాలయం కులపతి కేసీ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. ట్రిపుల్ ఐటీలో రక్షణ కోసం ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వ్యయం చేస్తోంది. అయితే సెక్యూరిటీ డొల్లతనంతో గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి.
నూజివీడు ఘటనపై మంత్రి ఆదిమూలపు సీరియస్ * పూర్తి స్ణాయి విచారణకు ఆదేశాలు
విజయవాడ: కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో బాలికల హాస్టల్ గదిలోకి ఒక విద్యార్థి ప్రవేశించిన ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవద్దా అంటూ సిబ్బందిపై మండిపడ్డారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. త్వరలో నూజివీడు ట్రిపుల్ ఐటీని సందర్శిస్తానన్నారు.