ఆంధ్రప్రదేశ్‌

జేసీ సోదరులకు బిగుస్తున్న ఉచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 23 : అనేక అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వరుస ఎదురు దెబ్బలతో పీకల్లోతు కూరుకుపోయిన జేసీ సోదరులకు త్వరలో మరో ఉచ్చు బిగుసుకోబోతోంది. నాగాలాండ్‌లో స్క్రాప్‌లో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన నిషేధిత బీఎస్-3 లారీలను బీఎస్-4గా మార్చి నకిలీ డాక్యుమెంట్లతో వాటిని జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయించినట్లు రవాణా శాఖ గుర్తించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మొత్తం 68 లారీలు అక్రమంగా విక్రయించినట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ గుర్తించి ఆ మేరకు చేసిన ఫిర్యాదుతో తొలుత ఎఫ్‌ఐఆర్ ఉంది. ఈ కేసుకు పొడిగింపుగా రెండు, మూడు రోజుల్లో మరో కేసు నమోదు చేయడానికి రవాణా శాఖ పకడ్బందీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అక్రమాలకు సంబంధించి వందలాది లారీలు తిరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఇంకా లోతుగా విచారణ జరిపిన రవాణా శాఖ మరో 86 లారీలు ఉన్నట్లు గుర్తించింది. వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సంబంధిత అధికారులు సేకరించారు. దీంతో జేసీ సోదరులకు నోటీసులిచ్చి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం విశేషం. తొలుత నమోదైన కేసులో అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బీఎస్-3 లారీలను కొన్నట్లు రవాణా శాఖ అధికారులు సమగ్ర విచారణలో తేల్చిన విషయం విదితమే. ఈ విషయంపై ఆదివారం డీటీసీ శివరామ్‌ప్రసాద్‌ను ఆంధ్రభూమి సంప్రదించగా రాష్ట్ర రవాణాశాఖ కమిషనరేట్ నుంచి తమకు ఆన్‌లైన్‌లో మరో 86 బీఎస్-3 లారీలను అక్రమంగా విక్రయించినట్లు సమాచారం వచ్చిందన్నారు. జేసీ సోదరులు పాల్పడిన లారీల కుంభకోణంలో మొత్తంగా 154(తొలి 68 లారీలు కలిపి) ఉన్నట్లు గుర్తించామన్నారు. త్వరలో వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయిస్తామన్నారు.

*చిత్రం...జేసీ సోదరులు