ఆంధ్రప్రదేశ్‌

ఆగని నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 24: ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని నినాదంతో లేచిన అమరావతి ఉద్యమ కెరటం అంతకంతకూ ఎగసిపడుతూనే ఉంది. రైతులు, మహిళలు, విద్యార్థులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజా, న్యాయవాద, జేఏసీ సంఘాల ప్రతినిధులు ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. రైతుల భూత్యాగాలతో ఏర్పడిన అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని లేచిన గొంతుకలు ఉద్యమం 70వ రోజుకు చేరుకుంటున్నా స్వరం పెంచుతూనే ఉన్నాయి. సోమవారం నాటికి రాజధాని గ్రామాల్లో అమరావతి పరిరక్షణను కోరుతూ జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు 69వ రోజుకు చేరుకున్నాయి. రైతులు, మహిళలు పలు రూపాల్లో తమ ఆందోళనలు తెలియజేశారు. ఆదివారం బాపట్ల ఎంపీ నందిగం సురేష్, అమరావతి మహిళా జేఏసీ మధ్య జరిగిన ఘర్షణపై రాజధాని గ్రామాలు అట్టుడికాయి. మహిళలపై దాడి చేయడాన్ని హేయమైన చర్యగా అభివర్ణిస్తూ ఆయా గ్రామాల్లో రైతులు వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేశారు. మహిళలు తమపై సురేష్ అనుచరులు దాడి చేసి తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెదపరిమిలో మానవహారంగా ఏర్పడి ‘మూడు రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు’ అంటూ రైతులు పెద్దఎత్తున నినాదాలతో హోరెత్తించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెళ్లే సమయంలో సీడ్ యాక్సెస్ రోడ్డుపై రాజధాని రైతులు మానవహారం ఏర్పాటు చేశారు. ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ రాజధాని తరలిపోకుండా చూడాలంటూ వౌనంగా వేడుకున్నారు. అలాగే ప్రయాణికులకు కూడా నమస్కరిస్తూ మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయం, అసెంబ్లీకి వెళ్లే మార్గంలో రోడ్డుపై జై అమరావతి అని రాసి తమ ఆకాంక్ష తెలియజేశారు. తుళ్లూరులో మోకాళ్లపై నిలబడి మానవహారం నిర్వహించి అమరావతిని కాపాడాలంలటూ నినాదాలు చేశారు. మందడంలో మహిళలు రోడ్లు ఊడ్చి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న దీక్షల్లో మహిళలు, రైతులు మోకాళ్లపై నిలబడి ఆందోళన జరిపారు. కృష్ణాయపాలెం, వెలగపూడి, పెనుమాక, ఎర్రబాలెం, రాయపూడి తదితర గ్రామాల్లో రైతులు 24గంటల దీక్షలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. ఈసందర్భంగా మహిళలు, జేఏసీ నాయకులు మాట్లాడుతూ 69రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు. ఎంపీ నందిగం సురేష్ కూడా ఈప్రాంత వాసిగా జై అమరావతి అనాలని కోరితే మహిళలపై దాడికి పాల్పడటం అమానుషమని మండిపడ్డారు.
*చిత్రం... మానవహారంగా ఏర్పడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వౌనంగా వినతులు చేస్తున్న మహిళలు