ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో కొనసాగిన ఆందోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 2: మూడు రాజధానుల ప్రకటనను ఉపసంహరించుకుని, అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు సోమవారం నాటికి 76వ రోజుకు చేరగా ఇప్పటికే పలు రూపాల్లో, వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ వచ్చిన రైతులు ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతం 29 గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి. సోమవారం తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, బేతపూడి, కురగల్లు, పెదపరిమి, ఉండవల్లి, తాడికొండ అడ్డరోడ్డు, తదితర ప్రాంతాల్లో రైతులు, మహిళలు రిలే దీక్షలు, మహాధర్నాలను కొనసాగించారు. రాయపూడి గ్రామంలో మహిళలు ఒంటికాలిపై నిలబడి, మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ప్రభుత్వ మొండి వైఖరిని విడనాడి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మందడం గ్రామంలోని చర్చిలో మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దినాలు ఆచరించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మనసును మార్చి అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని ప్రార్థనలు నిర్వహించారు. ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుండి వచ్చిన రైతులు రాజధాని గ్రామాల్లో నిర్వహిస్తున్న దీక్షా శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు, మహిళలు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చిన తమపై ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. రాజధాని గ్రామాల్లో అన్నివర్గాల వారు ఉన్నారని, ఓ సామాజికవర్గం ముద్ర వేసి విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని హితవుపలికారు. ఎస్సీ నియోజకవర్గమైన తాడికొండ పరిధిలోని మండల, గ్రామాల ప్రజలందరూ ఓట్లు వేస్తేనే వైసీపీ విజయం సాధించిందని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. నాడు అసెంబ్లీలో రాజధానిపై చర్చ జరిగిన సమయంలో 30 వేల ఎకరాలు కావాలని అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చెప్పలేదా అని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయంతో మా జీవితాలు వీధినపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయం చేయాలని కోరితే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. కాగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, పలువురు వామపక్ష నేతలు పాల్గొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
*చిత్రాలు..ఒంటికాలిపై నిలబడి మహిళల నిరసన
* చర్చిలో మహిళల ప్రార్థనలు