ఆంధ్రప్రదేశ్‌

తడిసి ముద్దయిన గోదావరి జిల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి జిల్లాలు బుధవారం తడిసి ముద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో భారీగాను, మరికొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో రహదార్లపై మోకాలి లోతు వర్షపు నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని కొండ వాగులు, ఏర్లు పొంగిపొర్లుతున్నాయి. పాములేరు, షోకులేరు పొంగి ప్రవహిస్తుండటంతో దేవీపట్నం మండలంలోని ఎనిమిది గ్రామాలు, వై.రామవరం, అడ్డతీగల, రంపచోడవరం మండలాల్లో 13 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఫలితంగా రాకపోకలు స్తంభించాయి. రాజానగరం, వడిశలేరు, రంగంపేట వద్ద రహదారిపైకి వర్షం నీరు చేరింది. కోరుకొండ రోడ్డులోని గాడాల వద్ద వర్షం నీరు రావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. సూరంపాలెం, ఏలేరు, మద్దిగడ్డ, సుబ్బారెడ్డి సాగర్ రిజర్వాయర్లు వర్షపు నీటితో కళకళలాడుతున్నాయి. సూరంపాలెం రిజర్వాయర్ నుంచి వచ్చిన వరద నీటితో బురదకాల్వ పొంగడంతో సీతానగరంలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. తూర్పు తీరప్రాంతంలో గంటకు 40నుండి 50కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కాకినాడ-ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్ళకుండా అధికారులు నిఘా ఏర్పాటుచేశారు. భారీ వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరు, బొంతేరు, గొంతేరు, మాగలేరు, వెస్ట్ కుక్కులేరు డ్రెయిన్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మొగల్తూరు, ముత్యాలపల్లి, కాళీపట్నం గ్రామాల్లో జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
కాళ్లవాపు వ్యాధి విజృంభిస్తున్న తూర్పు గోదావరి జిల్లా విఆర్‌పురం మండలంలో కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ బుధవారం పర్యటించారు. రేఖపల్లి పిహెచ్‌సిని సందర్శించి అక్కడ కాళ్లవాపు వ్యాధి సోకిన రోగులతో మాట్లాడారు. అన్నవరం గ్రామంలో కాళ్లవాపు వ్యాధికి చికిత్స పొంది ఇళ్లకు వచ్చిన రోగులను ప