ఆంధ్రప్రదేశ్‌

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మార్చి 4: ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చిత్రపరిశ్రమలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ విజ్ఞప్తి చేసింది. నూతనంగా ఏర్పాటయిన ఏపీలో చిత్రపరిశ్రమకు ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్ మోహన్‌రెడ్డిని కలిసిన కౌన్సిల్ సభ్యులు చిత్రపరిశ్రమలో ఉన్న సమస్యలను వినతిపత్రం ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా ఎవరికైనా స్టూడియో నిర్మాణం కోసం స్థలాలు కేటాయించదలిస్తే ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించే వారికే స్థలాలను కేటాయించాలన్నారు. విభజన నిష్పత్తిలో భాగంగా నిర్మాతలు కచ్చితంగా ఏపీలో షూటింగ్‌లు, డబ్బింగ్‌లు, రికార్డింగ్‌లు, విజ్యువల్ ఎఫెక్ట్‌లు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలా చేస్తే ఇన్‌కంమ్ ట్యాక్స్‌లో రాష్ట్రానికి రాబడి వస్తుందన్నారు. సినిమా పరిశ్రమను మరింత అభివృద్ధి చేసే క్రమంలో రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. విశాఖలో పరిశ్రమ అభివృద్ధికి మంచి అవకాశం ఉన్నందున దానిపై దృష్టి సారించాలన్నారు. డిజిటల్ ప్రొవైడర్స్‌పై నియంత్ర పెట్టాలన్నారు. లో బడ్జెట్ సినిమాలు మినిమం 16 వారాలు థియేటర్స్‌లో ఆడే విధంగా జీవో అమలు చేయాలన్నారు. టిక్కెట్ కౌంటింగ్ కోసం సీసీ కెమెరాలను థియోటర్స్‌లో ఏర్పాటు చేయలన్నారు. రహదారులపై జరిగే షూటింగ్‌లకు ఫ్రీ పర్మిషన్ ఇప్పించాలన్నారు. వీటితో పాటు మరికొన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వచ్చారు.
*చిత్రం... ముఖ్యమంత్రిని సత్కరిస్తున్న ఏపీ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చైర్మన్ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి