ఆంధ్రప్రదేశ్‌

స్థానిక సమరానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిర్వహించేందుకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్‌కుమార్ తెలిపారు. స్థానిక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ ప్రక్రియపై జిల్లాలకు చెందిన పంచాయతీ, మున్సిపల్, పోలీసు, తదితర అధికారులతో చర్చించామన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సాధారణ ఎన్నికల ప్రమాణాలతోనే అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్లకు, జిల్లా ఎస్పీలకు సూచనలు జారీ చేసామన్నారు. అంతర్‌జిల్లాల, అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తామని, ఇందుకు పోలీసు అధికారుల సేవలు వినియోగిస్తామన్నారు. ఇందుకు పోలీసు శాఖ సుముఖతను వ్యక్తం చేసిందన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సంబంధించి శిక్షణను పూర్తి స్థాయిలో అందించేందుకు జిల్లా కలెక్టర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. బ్యాలెట్ బాక్స్‌లకు సంబంధించి 1.20 లక్షల బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయని, తెలంగాణ
రాష్ట్రం 40వేల బాక్స్‌లు, ఒడిశా రాష్ట్రం 5 వేల బాక్స్‌లు సరఫరా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసాయన్నారు. శుక్రవారం రాజకీయ పార్టీలతో సమావేశం, అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పంచాయతీ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎస్ రామసుందరరెడ్డి, జాయింట్ సెక్రటరీ ఏవీ సత్యరమేష్‌లు పాల్గొన్నారు.
వేర్వేరు తేదీల్లో, ఒకే దశలో స్థానిక ఎన్నికలు?
రాష్ట్రంలో వివిధ స్థానిక సంస్థల ఎన్నికలు వేర్వేరు తేదీల్లో ఒకే దశలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అధికారులు నివేదించారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో గురువారం ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌తో పురపాలక, పంచాయతీరాజ్, పోలీస్ శాఖలు ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 21న, 24న మున్సిపాలిటీలకు, 27న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చించారు. వేర్వేరు తేదీల్లో ఏక కాలంలో ఎన్నికల నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్నికల కమిషనర్ ముందు అధికారుల బృందం ఉంచింది. ఈ నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలంటే ఇదే ప్రత్యామ్నాయమని కమిషనర్‌కు అధికారులు వివరించారు. రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం నిధులు మార్చి నెలాఖరులగా రావాలంటే ఈ లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తే బాగుంటుందని సూచించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. పోలీసు బందోబస్తు, పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బంది, తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం తరపున లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి, వివరాలు అందచేస్తామని కమిషనర్‌కు అధికారుల బృందం తెలిపింది.
*చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్