ఆంధ్రప్రదేశ్‌

ఉక్కుపాదమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 5: రాష్ట్రంలో మద్యం అక్రమ తయారీ, ఇసుక అక్రమ రవాణా ఉండకూదని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల స్వరూపాన్ని మార్చేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, అక్రమ మద్యం తయారీ వంటివి ప్రభుత్వ లక్ష్యాలను దెబ్బతీస్తాయన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ
నిరోధంపై ఎక్సైజ్ శాఖ అధికారులతో ఆయన గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు, విద్యా బోధనలో ఇంగ్లీషు మీడియం తరగతుల వంటి మార్పులు తీసుకువస్తున్నామని గుర్తు చేశారు. గ్రామాల సమగ్రాభివృద్ధిలో భాగంగా ఇటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాల్లో బెల్టుషాపులు ఉండకూడదన్నారు. మద్యం అక్రమ తయారీ కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఇసుక, మద్యం అక్రమ రవాణా జరుగకుండా చూడాలన్నారు. దీనికి సంబంధించిన ఘటనలపై పోలీసులు, ఎన్‌ఫోర్సుమెంట్ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ఠ పెరగాలంటే బెల్టుషాపులు ఉండకూడదన్నారు. గ్రామాల్లో 11 వేలకు పైగా మహిళా పోలీసులు ఉన్నారని, వీరిని శక్తివంతంగా వాడుకోవాలన్నారు. వారందరికీ ఫోన్లు ఇచ్చామన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం రప్పించుకోవాలన్నారు. బెల్టుషాపుల నిరోధం మహిళా పోలీసుల ప్రాథమిక విధి అని తెలిపారు. మహిళా మిత్రల సేవలను కూడా ఇందుకు వినియోగించాలన్నారు. ఎన్‌ఫోర్సుమెంట్ విభాగంలో సిబ్బంది సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఉన్న మూడింట రెండు వంతుల మందిని ఎన్‌ఫోర్సుమెంట్ పనుల కోసం వినియోగించాలన్నారు. స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్‌ను తయారీ ద్వారా విధి నిర్వహణలో సమర్థత పెంచుకుని, అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి