ఆంధ్రప్రదేశ్‌

వేసవి దాహం తీర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వేసవిలో నీటి ఎద్దడి నివారణకు 204.75 కోట్ల రూపాయలతో ముందస్తు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. 6352 ఆవాసాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రతిపాదించింది. వెలగపూడి సచివాలయంలో గ్రామీణ మంచినీటి సరఫరాపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. రానున్న వేసవిలో మంచినీటి ఎద్దడిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రులు చర్చించారు. వివిధ ఆవాస ప్రాంతాల్లో ఎదురయ్యే
మంచినీటి సమస్యను నివారించేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ రూపొందించిన ప్రణాళికను అధికారులు వివరించారు. 8570 ఆవాసాల్లో వివిధ పథకాల కింద నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు 204.75 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని తెలిపారు. 6352 ఆవాసాలకు 165.81 కోట్ల రూపాయలతో ట్యాంకర్లతో సరఫరా చేయాల్సి ఉంటుందని వివరించారు. 2055 ఆవాసాల్లో పశువుల కోసం 20.19 కోట్ల రూపాయలతో టాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. 2440 బోర్లకు ఫ్లషింగ్, 968 బోర్లను లోతు చేయడం, 5.8 కోట్లతో చెరువుల్లో పూడికతీత వంటివి చేపడుతున్నట్లు తెలిపారు. వైఎస్సార్ సుజల పథకం కింద 46.56 కోట్ల రూపాయలతో మంచినీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు వివరించారు. దీనితో పాటు స్టేట్ డెవలప్‌మెంట్ పథకం కింద సోలార్ స్కీమ్‌లను కూడా ప్రారంభించామన్నారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... అధికారులతో సమీక్షిస్తున్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్