ఆంధ్రప్రదేశ్‌

ఇళ్ల స్థలాలకు సత్వరం భూసేకరణ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 5: ఉగాది నాడు ప్రభుత్వం నిర్ధేశిత లక్ష్యం మేరకు పంపిణీ చేయతలపెట్టిన ఇళ్ల స్ధలాలకు అనువైన ప్రైవేటు భూములను సత్వరం సేకరించడానికి కృషిచేయాలని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నీరబ్‌కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ శాఖాధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇళ్ల స్థలాలుగా పంపిణీచేయడానికి ముందుగా అందుబాటులోని ప్రభుత్వ స్థలాలను సేకరించాలని సూచించారు. ప్రభుత్వ భూముల లభ్యత కంటే లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట ప్రైవేటు భూములను సేకరించాల్సి ఉంటుందని సూచించారు. ఇళ్ల స్థలాలకు అవసరమైన భూసేకరణకు అధికారులు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ముందుకు వెళ్లాలని ఆదేశించారు. అనంతరం మండలాల వారీ లబ్ధిదారులు, మండలాలవారీ ఇళ్ల స్ధలాల అవసరం, ఇప్పటి వరకు సేకరించిన భూమి తదితర వివరాలను సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్ తెలుసుకున్నారు.